Weekend Releasing Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీ లో విడుదల కాబోతున్న 14 సినిమాలు…!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్ తర్వాత దసరా, దీపావళి బిగ్గెస్ట్ సీజన్.. వందల కోట్ల బిజినెస్ తో స్టార్ హీరోల సినిమాలు బరిలో దిగుతాయి.. సందట్లో సడేమియా అన్నట్టు చిన్న సినిన్స్లు కూడా రిలీజులు ప్లాన్ చేసుకుంటుంటాయి.. ఈ దసరాకి మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.. చిరు సినిమాకి హిట్ టాక్ వచ్చింది కానీ ‘ఘోస్ట్’ ని పట్టించుకునే వారే లేకపోయారు.. తర్వాత వచ్చిన చిన్న సినిమాలు ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నాయి .. కట్ చేస్తే కన్నడ డబ్బింగ్ బొమ్మ ‘కాంతారా’ మాత్రం బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది.. నెక్స్ట్ ఆడియన్స్ దీపావళి సినిమాల గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఈ దివాలీకి థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చెయ్యబోతున్న సినిమాలేంటో చూద్దాం..

మంచు హీరో కామ్ ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’ ఈనెల 21న రిలీజ్ అవుతోంది.. కుర్రకారుకి కంటిమీద కునుకులేకుండా చేసిన సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా యాక్ట్ చేసారు.. ఇషాన్ సూర్య డైరెక్షన్లో, సొంత ప్రొడక్షన్లో విష్ణు నిర్మించాడు.. పాన్ ఇండియాకి రెండు భాషలు తగ్గించి తెలుగుతో పాటు హిందీ, మలయాళం లాంగ్వేజెస్ లో ‘జిన్నా’ విడుదలవుతోంది..

కోలీవుడ్ యంగ్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ‘ఖైదీ’ బ్లాక్ బస్టర్ తర్వాత కార్తీకి ఆ రేంజ్ సినిమా పడలేదు.. ఇప్పుడు ‘సర్దార్’ అనే సాలిడ్ సినిమాతో అక్టోబర్ 21న థియేటర్లలోకి వస్తున్నాడు.. రాశీ ఖన్నా, రజీషా విజయన్ కథానాయికలు.. అప్పటి అందాల హీరోయిన్ లైలా ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది.. పి. ఎస్. మిత్రన్ డైరెక్టర్.. ట్రైలర్ లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి హైప్ క్రియేట్ చేసాడు కార్తీ..

ఫస్ట్ ఫిలిం ‘జాతిరత్నాలు’తో సెన్షేషన్ క్రియేట్ చేసాడు యంగ్ డైరెక్టర్ అనుదీప్.. యంగ్ అండ్ టాలెంటెడ్ కోలీవుడ్ యాక్టర్ శివ కార్తికేయన్ ‘రెమో’,’సీమరాజ’, ‘హీరో’, ‘డాన్’, ‘డాక్టర్’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. అనుదీప్ ‘ప్రిన్స్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. తెలుగు, తమిళ్ లో ఈనెల 21న ‘ప్రిన్స్’ రిలీజవుతోంది..

తమిళనాట సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవులే’ సినిమా తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ అయ్యింది.. యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించగా.. ఒరిజినల్ వెర్షన్లో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ ని తెలుగులో విక్టరీ వెంకటేష్ చేసారు.. ప్రోమోస్ ప్రామిసింగ్ గా అనిపించడంతో సినిమాకి మంచి బజ్ వచ్చింది.. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ ఫిలిం కూడా దీవాలి స్పెషల్ గా ఈనెల 21న విడుదల కాబోతుంది..

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ..

యంగ్ హీరో శర్వానంద్, రీతువర్మ జంటగా.. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో.. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’.. కొంత గ్యాప్ తర్వాత అమల అక్కినేని కీలకపాత్రలో నటించారు.. సెప్టెంబర్ 9న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. అక్టోబర్ 20 నుండి సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది..

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బింబిసార’.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావ మరిది కె.హరి కృష్ణ నిర్మించారు.. వశిష్ట దర్శకుడిగా పరిచయం అయ్యాడు.. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన ‘బింబిసార’ అక్టోబర్ 21 నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవనుంది..

అమెజాన్ ప్రైమ్

పాపులర్ ఓటీటీ తమ ఫస్ట్ ఒరిజినల్ తెలుగు ఫిలిం ‘అమ్ము’ని ఈనెల 19 నుండి అందుబాటులోకి తీసుకొస్తుంది.. చారుకేష్ శేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, బాబీ సింహ, నవీన్ చంద్ర ఇంపార్టెంట్ రోల్స్ చేసారు.. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం

భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.. ఇంకా ‘ద పెరి ఫెరల్’, ‘ఫోర్ మోర్ షాట్స్’ వెబ్ సిరీస్ లు – అక్టోబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి..

నెట్ ఫ్లిక్

‘ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్’ (మూవీ) – అక్టోబర్ 19


‘బార్బేరియన్స్; (వెబ్ సిరీస్ – 2) – అక్టోబర్ 21

‘ఫ్రమ్ స్క్రాచ్’ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 21

జీ 5

‘ట్రిప్లింగ్’ (హిందీ సిరీస్ – 3) – అక్టోబర్ 21

ఆహా

‘పెట్టై కాలి’ (తమిళ్ మూవీ) – అక్టోబర్ 21

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus