ప్రతికథానాయకులుగా మెప్పించిన నటులు

  • March 28, 2018 / 05:25 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది ప్రతి కథానాయకులు తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా 90 దశకంలో చాలా మంది విలన్స్ ఉన్నారు. వారు తమ నటనతో భయపెట్టారు. అటువంటి ప్రతి కథానాయకులపై ఫోకస్..

1. రఘువరన్ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో మనకి రఘువరన్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ కనిపిస్తుంది. శివతో పాటు ఎన్నో చిత్రాల్లో రఘువరన్ డైలాగ్స్ తోనే దడ పుట్టించారు.

2. పరేష్ రావల్ గోవిందా గోవిందా, క్షణ క్షణం వంటి సినిమాల్లో పరేష్ రావల్ ప్రతేకమైన మ్యానరిజంతో అదరగొట్టారు.

3. అమ్రిష్ పురిసినిమాల్లో అమ్రిష్ పురి రూపం చూస్తేనే చిన్న పిల్లలు దడుసుకుంటారు. ఇక కళ్ళెర్ర చేసి డైలాగ్ చెబితే వణుకు పుడుతుంది.

4. రావు గోపాల రావు ‘ఓరిని దస్స రావాలబొడ్డు..” ఇలాంటి సరికొత్త ఊతపదాలతో రావు గోపాల రావు ఎక్కువకాలం విలన్ గా అలరించారు.

5. రామి రెడ్డి రామి రెడ్డి సైలెంట్ గా ఉన్నా కళ్ళు మాత్రం బెదిరిస్తున్నట్టుగా ఉంటుంది. సాంఘిక చిత్రాల్లోనే కాదు భక్తి రస చిత్రాల్లోనూ దేవతలకు ఎదురెళ్లే విలన్ గా పేరు తెచ్చుకున్నారు.

6. టైగర్ ప్రభాకర్ జీరగొంతుతో చాలా స్టైల్ గా ప్రభాకర్ విలనిజాన్ని ప్రదర్శించారు. స్టార్ హీరోలతో పోటీగా నటించి మెప్పించారు.

7. నాజర్ అప్పట్లో కెరీర్ మొదలెట్టిన నాజర్ నెగటివ్ రోల్స్ తో అభినందనలు అందుకున్నారు. అప్పుడప్పుడు పాజిటివ్ రోల్స్ లో కూడా మెప్పిస్తున్నారు.

8. కోట శ్రీనివాస రావు కోట శ్రీనివాస రావు పోషించని రోల్ అంటూ లేదు. నవ్వించారు.. ఏడిపించారు. భయపెట్టటారు కూడా. గణేష్ చిత్రంలో విలనిజాన్ని కొత్తగా చూపించారు.

9. మహేష్ ఆనంద్ బాలకృష్ణ, చిరు సినిమాల్లో మహేష్ ఆనంద్ సడన్ గా ఎంట్రీ ఇచ్చి యాక్షన్ తో ఆకట్టుకున్నారు.

10. శ్రీ హరి హీరోగా మారక ముందు ప్రతి కథానాయకుడిగా శ్రీ హరి అనేక చిత్రాల్లో మెప్పించారు.

11. మోహన్ బాబు నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలను మోహన్ బాబు పోషించినంతగా ఎవరూ పోషించలేరు.

12. కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ కాలం నుంచే కైకాల సత్యనారాయణ నెగటివ్ క్యారెక్టర్స్ ని ఓ ఆట ఆడుకున్నారు. ఇప్పుడు తాత పాత్రకు పరిమితమైన అప్పట్లో ప్రముఖ విలన్స్ జాబితాలో కైకాల సత్యనారాయణ ఉండేవారు.

13. శరత్ సక్సేనా 1990 లో వచ్చిన అనేక తెలుగు చిత్రాల్లో శరత్ సక్సేనా విలన్ గా భయపెట్టించారు.

14. దేవరాజ్ సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవిలకు పోటీగా దేవరాజ్ తన విలనిజంతో అభినందనలు అందుకున్నారు.

15. దేవన్సహజమైన నటనతో విలన్ గా దేవన్ మెప్పు పొందారు. ఇతను ఇప్పటికీ విలన్, క్యారక్టర్ రోల్స్ పోషిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus