అభినేత్రి సావిత్రి సంసారం నుంచి గోరింటాకు సినిమా వరకు తెలుగు, తమిళ భాషల్లో 84 చిత్రాల్లో నటించారు. సింగిల్ టేక్ ఆర్టిస్టుగా దర్శకనిర్మాతలతో పిలిపించుకున్న ఈ నటి.. తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లుగా ఆరాధించే ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సైతం సావిత్రిని మహానటి అని గౌరవించేవారు. గుంటూరుజిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన సావిత్రిని మహానటిని చేసింది ఆమె పోషించిన పాత్రలే. అలాంటి మరిచిపోలేని పాత్రల్లో కొన్నింటిపై ఫోకస్ ..
1. సావిత్రి (పెళ్లి చేసి చూడు, 1952)
2. పార్వతి (దేవదాసు, 1953)
3. పద్మ (అర్ధాంగి, 1955)
4. మధురవాణి (కన్యాశుల్కం, 1955)
5. మేరీ (మిస్సమ్మ, 1955)
6. శశిరేఖ (మాయాబజార్, 1957)
7. సుగుణ (వెలుగు నీడలు, 1961)
8. లక్ష్మి (గుండమ్మ కథ, 1962)
9. రాధ (మూగ మనసులు, 1964)
10. ద్రౌపది (నర్తనశాల, 1963)
11. సీత & లలిత (దేవత, 1965)
12. మాధవి (డాక్టర్ చక్రవర్తి, 1964)
13. రాధ (నవరాత్రి , 1966)
14. శారద (సుమంగళి, 1965)
15. పద్మ (చివరకు మిగిలేది, 1960)
ఇవి సావిత్రి పోషించిన అత్యుత్తమ పాత్రల్లో కొన్ని మాత్రమే. ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నాయి.