15 ఏళ్ళ ‘ప్రేమిస్తే’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

  • October 13, 2020 / 02:27 PM IST

మన హృదయాలకు హత్తుకున్న గొప్ప ప్రేమ కథ, ప్రేమిస్తే సినిమా. ఆ సినిమా విడుదల అయి అక్టోబర్ 12 కి 15 సవంత్సరాలు అయిన సందర్భంగా… సినిమా అంటే మనకు కాసేపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సినిమా అంటే మనకు ఎదో చెప్పాలి. సినిమా అంటే మనలో కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అని మనకు తెలియచెప్పాలి. సినిమా అంటే ఏం ఉంది ఆ సినిమా అని మనకు అనిపించాలి. సినిమా అంటే సరికొత్తగా ఇంకేదో. ఈ పైన చెప్పుకున్న ప్రతిదానిని మనకు చూపించిన సినిమా అది. అదే ప్రేమిస్తే. ఆ సినిమా వచ్చి అక్టోబర్ 12 కి 15 సవంత్సరాలు అవుతుండగా మనల్ని ఎంతగానో అలరించిన ప్రేమిస్తే సినిమా మధుర జ్ఞాపకాలు.

సమాజంలో మనం ఎక్కడో ఒక చోట మనం నిత్యం చూస్తూ ఉండే కథనే సినిమాగా తీస్తే మనకు చాలా బాగా నచ్చి సూపర్ హిట్టు అయింది ప్రేమిస్తే. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని అబ్బాయి పిచ్చోడు అవ్వడం క్లైమాక్స్ లో నిజంగా మనల్ని గుండెలకు హత్తుకుంటుంది. మురళీ ఒక మెకానిక్ ఐశ్వర్య ఒక వైన్ షాప్ ఓనర్ కూతురు. మురళీ ని ప్రేమిస్తుంది. ఆ పేదవాడి ప్రేమలో నిజాయతి నచ్చి ఆ ప్రేమికుల మధ్య కాలం క్షణంలా సాగిపోతుండగా, ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతారు. వేరే ఊరులో కలసి బ్రతుకుతుండగా ఇంట్లో వాళ్ళు తెలుసుకొని మీకు పెళ్లి జరిపిస్తాం అని చెప్పి తీసుకొచ్చి మురళిని కొట్టి ఐశ్వర్య కు వేరే అబ్బాయితో పెళ్లి జరిపిస్తారు. ఆ బాధతో మురళీ కొన్ని సవంత్సరాలకు పిచ్చోడు అయిపోతాడు.

ఈ కథలో పిల్లల ప్రేమ, పెద్దల మోసం, ప్యూర్ లవ్ తాలుకా ఎమోషన్ తప్ప మరేది ఉండదు, కానీ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రమ్మరధం పట్టారు. ఎందుకో తెలుసా, ఈ సినిమాలో ఒక నిజాయతి ఉంది, దర్శకుడు తను చెప్పలనుకున్నదానిని క్లారిటిగా చెప్పారు. మనం ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు తప్పకుండా చర్చించవలసిన మరో రెండు డిపార్టమెంట్ లు కెమెరా అండ్ సంగీతం. విజయ్ మిలిటన్ అందించిన కెమెరా వర్క్ అయితే సినిమాను స్క్రెన్ ప్లే జతకలిపిన ఒక పెయింటింగ్ లా మనకు చూపించింది. నేటివిటి కూడా అత్యద్భుతంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఒక డబ్బున్న అమ్మాయి, ఒక పేదింటి అబ్బాయి లవ్ లో పడి వాళ్ళ మధ్య వచ్చే రొమాంటిక్ సిన్లలో మనం కెమెరా మ్యాన్ గ్రేట్ వర్క్ లేకుండా అలాంటి మేమురుబుల్ అనుభూతిని పొందలేము. అలాగే సంగీతం అందించిన జాషువు శ్రీధర్ ని కూడా మనం అభినందించకుండా ఉండలేము.

తను మనకు అందించిన ఒక్కక్క సాంగ్ ఒక ఆణిముత్యం, ప్రతి సిన్ లో ఎలివేట్ అయ్యే బ్యాకగ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకు ప్రాణం పోసింది అని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా దర్శకత్వం బాలాజీ శక్తివేల్, తీసుకున్న కథ మాములుదే అయినా దానిని ఎలా చెప్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారో కరక్ట్ గా తెలిసిన డైరెక్టర్ తిను. క్లైమాక్స్ లో తన వల్లే మురళీ పిచ్చోడు అయిపోయాడు అని ఐశ్వర్య రోడ్డున కూర్చొని బిగ్గరగా ఏడుస్తుటే అది చూసి వచ్చిన ఐశ్వర్య భర్త మురళీ ని ఐశ్వర్య ను కలపి ఇంటికి తీసుకెళ్ళే సిని తో ప్రేక్షకులు అంతసేపు బాధ పడినప్పటికీ ఆ ఒక్క సిన్ తో సినిమాకు బాగా కనక్ట్ అయి సినిమాను సూపర్ డూపర్ హిట్టు చేశారు. తమిళంలో సూపర్ సక్సెస్ సాధించి ఖర్చు పెట్టిన బడ్జెట్ కి పదింతలు లాభం తెచ్చి పెట్టిన ఒక క్లాసికల్ పెయిన్ ఫుల్ లవ్ స్టొరీ ని తెలుగు ప్రేక్షకులకు మనకు అందించారు ప్రముఖ జర్నల్సిట్ మరియు నిర్మాత సురేష్ కొండేటి. ఈ సినిమాకు దర్శకులు మారుతి ఎక్ష్క్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవరించాగ ఏస్.కే పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భితమైన సినిమాను అందించారు. ఈ సినిమా తమిళం లో కంటే తెలుగులో ఇంకా పెద్ద ఘన విజయం సాధించడం విశేషం. ఒక నిజాయతి కలిగిన ప్రేమ కథను చూడాలి అనుకునే వారు ఈ సినిమాను ఖచ్చితంగా చూడండి.

1

2

3

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus