స్టార్ హీరోలే కాదండోయ్ ‘టైర్ 2’.. అంటే మీడియం రేంజ్ హీరోలు కూడా మొదటిరోజు అత్యధిక కలెక్షన్లను రాబడుతున్నారు. స్టార్ డైరెక్టర్లతో.. అలాగే స్టార్ ప్రొడ్యూసర్లతో సినిమాలు చెయ్యకపోయినా .. మొదటి రోజు వీళ్ళ సినిమాలకి కూడా మంచి కలెక్షన్లు వస్తుండడం విశేషం. ఒకవేళ స్టార్ డైరెక్టర్స్ అలాగే స్టార్ ప్రొడ్యూసర్లతో సినిమాలు చేస్తే .. వీళ్ళ సినిమాలు కూడా స్టార్ హీరోల రేంజ్ కు తగ్గకుండా కలెక్షన్లు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. నాని తో మొదలుపెడితే.. విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, నితిన్,.. అబ్బో ఈ లిస్ట్ కొంచెం పెద్దదే. మరి మొదటిరోజు అదీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ‘టైర్ 2’ హీరోల సినిమాలను ఓ లుక్కేద్దాం రండి.
1) ఇస్మార్ట్ శంకర్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 7.73 కోట్ల షేర్ ను రాబట్టి .. నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకుంది.
2) అఖిల్ : అక్కినేని మూడో తరం వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి చిత్రమైన ‘అఖిల్’ చిత్రం నెంబర్ 2 ప్లేస్ ను దక్కించుకుంది. వి.వి.వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో.. ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 7.60 కోట్ల షేర్ ను రాబట్టింది.
3) ఎం.సి.ఏ : నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 7.57 కోట్ల షేర్ ను రాబట్టింది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించడం మరియు డిస్ట్రిబ్యూట్ చేయడంతో మంచి వసూళ్లు వచ్చాయి.
4) శైలజారెడ్డి అల్లుడు : నాగ చైతన్య హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని మారుతీ డైరెక్ట్ చేసాడు. వినాయక చవితి సెలవు రోజున విడుదల కావడంతో ఈ చిత్రానికి మొదటి రోజు 6.93 కోట్ల షేర్ వచ్చింది.
5) డియర్ కామ్రేడ్ : విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 6.70 కోట్ల షేర్ ను రాబట్టింది. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. ‘గీత గోవిందం’ పెయిర్ కావడం అందులోనూ ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి పెద్ద సంస్థ నిర్మించడంతో మంచి వసూళ్లు వచ్చాయి.
6) గద్దలకొండ గణేష్ (వాల్మీకి) : వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 5.83 కోట్ల షేర్ ను రాబట్టింది.
7) గీత గోవిందం : విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీత గోవిందం’. పరుశురాం (బుజ్జి) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గీత ఆర్ట్స్’ రెండో సంస్థ అయిన ‘జిఏ2 పిక్చర్స్’ వారు నిర్మించడంతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 5.81 కోట్ల షేర్ ను రాబట్టింది.
8) విన్నర్ : సాయి తేజ్, రకుల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం .. మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ ను రాబట్టింది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మదు నిర్మించడంతో మొదటి రోజు 5.65 కోట్ల షేర్ ను రాబట్టింది.
9) మజిలీ : చైసామ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేసాడు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం 5.60 కోట్ల షేర్ ను రాబట్టింది.
10) అ ఆ : నితిన్, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసాడు. దీంతో తెలుగురాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు 5.57 కోట్ల షేర్ ను రాబట్టింది.
11) కృష్ణార్జున యుద్ధం : నేచురల్ స్టార్ నాని డబుల్ రోల్ చేసిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం 4.62 కోట్ల షేర్ ను రాబట్టింది.
12) గ్యాంగ్ లీడర్ : నేచురల్ స్టార్ నాని హీరోగా ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు.. 4.57 కోట్ల షేర్ ను రాబట్టింది.
13) నోటా : విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రానికి తమిళ కుర్రాడు ఆనంద్ శంకర్ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం 4.55 కోట్ల షేర్ ను రాబట్టింది.
14) జెర్సీ : నేచురల్ స్టార్ నాని .. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ‘జెర్సీ’ చిత్రం కూడా.. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో 4.47 కోట్ల షేర్ ను రాబట్టింది.
15) నేను లోకల్ : నేచురల్ స్టార్ నాని హీరోగా త్రినాధ్ రావు డైరెక్షన్లో వచ్చిన ‘నేను లోకల్’ చిత్రం మొదటి రోజు.. తెలుగు రాష్ట్రాల్లో 4.41 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.
16) వరల్డ్ ఫేమస్ లవర్ : విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.40 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ చిత్రానికి ఇంకా ఎక్కువ ఎక్ష్పెక్ట్ చేయగా.. ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయిందనే చెప్పాలి.