This Weekend Movies: ఈ వారం ఓటీటీ/ థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ లు

  • June 26, 2023 / 08:19 PM IST

జూన్ నెలాఖరుకు వచ్చేశాం. ఈ నెలలో ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ కి కొంత ఊపిరి పోసింది. అయితే దీనికి ముందు.. దీని తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రేక్షకులను థియేటర్ కి రప్పించలేకపోయింది అని చెప్పాలి. వర్షాలు కూడా జనాలను థియేటర్ కి రాకుండా చేసేస్తున్నాయి అన్నది వాస్తవం. అయితే ఈ వారం అంటే జూన్ చివరి వారంలో ‘స్పై’ అనే సినిమా రిలీజ్ కాబోతుంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. తప్పకుండా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) స్పై : నిఖిల్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 29న విడుదల కాబోతోంది.

2) సామజవరగమన : శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ఈ మూవీ జూన్ 29న విడుదల కాబోతోంది.

3) ఇండియానా జోన్స్ : ఈ హాలీవుడ్ సినిమా కూడా జూన్ 29 నే ప్రేక్షకుల ముందుకు రానుంది.

4) లవ్ యు రామ్ : ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ ను అందించిన దర్శకుడు దశరథ్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 29 29 నే ప్రేక్షకుల ముందుకు రానుంది.

5) మాయా పేటిక : పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 30న రిలీజ్ కానుంది.

6) తొలిప్రేమ : పవన్ కళ్యాణ్ నటించిన ఆల్ టైం హిట్ మూవీ ‘తొలిప్రేమ’ .. జూన్ 30న రీ రిలీజ్ కానుంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

ఆహా

7) అర్థమైందా అరుణ్ కుమార్ (సిరీస్) – జూన్ 30

నెట్‌ఫ్లిక్స్

8) టైటాన్స్ 4 – జూన్ 25

9) లస్ట్ స్టోరీస్ 2(వెబ్ సిరీస్) – జూన్ 29

10) సీయూ ఇన్ మై నైన్టీన్త్ లైఫ్ (కొరియన్ సిరీస్) – జూన్ 29

11) అఫ్వా (హిందీ) – జూన్ 30

12) సెలబ్రిటీ (కొరియన్ సిరీస్) – జూన్ 30

అమెజాన్ ప్రైమ్

13) జాక్ ర్యాన్ 4 – జూన్ 30

14) వీరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం) – జూన్ 30

డిస్నీ+హాట్‌స్టార్ :

15) వీకెండ్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్) – జూన్ 29

16) ది నైట్ మేనేజర్ 2 – జూన్ 30

బుక్ మై షో :

17) ఫాస్ట్ ఎక్స్ (హాలీవుడ్) – జూన్ 29

జీ5

18) లకడ్ బగ్గా – జూన్ 30

జియో సినిమా

19) సార్జెంట్ (హిందీ సిరీస్) – జూన్ 30

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus