Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

ఒక హీరోయిన్‌, ఒకే హీరోతో వరుస సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది హీరోయిన్లు ఇలా చేశారు కూడా. అయితే ఓ సినిమా సెట్స్‌ మీద ఉండగానే.. అదే కాంబినేషన్‌లో మరో సినిమా సెట్‌ అవ్వడం అంటే పెద్ద విషయమే. ఇప్పుడు అదే జరుగుతోంది బాలీవుడ్‌లో. ఆ హీరోయిన్‌ శ్రీలీల అయితే, ఆ హీరో కార్తిక్‌ ఆర్యన్‌. బాలీవుడ్‌లో మోస్ట్‌ ప్రామిసింగ్‌ హీరోగా పేరు గాంచిన కార్తిక్‌ ఆర్యన్‌ – శ్రీలీల ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. ‘ఆషికీ’ స్టైల్‌ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది అని సమాచారం.

Sreeleela and Karthik Aryan

అనురాగ్‌ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమానే ‘తు మేరి జిందగీ హై’. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మరో సినిమాకు సర్వం సిద్ధమైందంటున్నారు. ‘చందు ఛాంపియన్‌’ సినిమా దర్శకుడు కబీర్‌ ఖాన్‌తో కార్తిక్‌ ఓ సినిమా చేయనున్నారు అని వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ఈ సినిమా ప్రకటిస్తారు అని కూడా అంటున్నారు. ఆ సినిమాలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేశారని సమాచారం.

స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న కబీర్‌ ఖాన్‌ సినిమాలో కార్తిక్‌ కిక్‌ బాక్సింగ్‌ కోచ్‌ పాత్రలో కనిపిస్తాడట. నిజ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం కార్తిక్‌ ఇప్పటికే శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలో పూర్తి స్థాయి చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా 2027లో థియేటర్లలోకి వస్తుందట. ఈ లెక్కన బాలీవుడ్‌లో శ్రీలీల మరింత బిజీ కాబోతోంది. దీంతో తెలుగులోకి రావడానికి టైమ్‌ పడుతుంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా అంటే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ మాత్రమే. అది కూడా ఈ నెలాఖరులో వచ్చేస్తుంది.

ఇది కాకుండా సౌత్‌లో ఆమె ధనుష్‌ 55వ సినిమాలో నటిస్తోంది. అది కూడా అయిపోతే సౌత్‌ సినిమాలేవీ లేవు. చూద్దాం ఈ లోపు ఏదైనా సినిమాను ఓకే చేస్తుందేమో. అవును డాక్టర్ల హీరో అన్నారేంటి కార్తిక్‌ ఆర్యన్‌ను అనుకుంటున్నారా? కార్తిక్‌ వాళ్ల పేరెంట్స్‌, సిస్టర్‌ డాక్టర్లే. ఇక శ్రీలీల కూడా డాక్టరే.

ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus