“2 కంట్రీస్” విడుదల రిలీజ్ డేట్ ఫిక్స్!

“జై బోలో తెలంగాణా” లాంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మలయాళ సూపర్ హిట్ సినిమా “2 కంట్రీస్”కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న చిత్రం “2 కంట్రీస్”. సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. “ఎన్ కౌంటర్” అనంతరం ఎన్.శంకర్ మళ్ళీ “2 కంట్రీస్” కోసం ఒక పాట రాయడం విశేషం.

మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలను దర్శకనిర్మాత ఎన్.శంకర్ చెబుతూ.. “మలయాళంలో సూపర్ హిట్ అవ్వడమే కాక రికార్డ్ స్థాయిలో వసూళ్లు దక్కించుకొన్న “2 కంట్రీస్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సునీల్ కి సరిగ్గా సరిపోయే రోల్ ఇది, సినిమా చాలా బాగా వచ్చింది. సరికొత్త సునీల్ ను ఈ సినిమాలో చూడబోతున్నారు. అధిక శాతం అమెరికాలో చిత్రీకరించబడిన ఈ చిత్రం షూటింగ్, డబ్బింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి, నా మునుపటి చిత్రాలు జయం మనదేరా, జైబోలో తెలంగాణా, శ్రీరాములయ్యా, భద్రాచలం చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు “2 కంట్రీస్” తప్పకుండా నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus