This Weekend Movies: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

ప్రతివారం కొత్త సినిమాలతో థియేటర్లు, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకునే వెబ్ సిరీసులతో పాటు.. ఓటీటీ ప్రీమియర్స్ కాబోయే కొత్త చిత్రాలతో ఓటీటీలు సందడి చేస్తూనే ఉన్నాయి.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేస్తూనే ఉన్నాయి.. హాల్స్‌లో రిలీజ్ అయ్యేటప్పుడుండే అంతటి హడావిడి లేకపోయినా కానీ, బిగ్ స్క్రీన్ మీద సరిగా ఆడని చిత్రాలు కూడా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి.. మరో నాలుగు వారాల్లో 2022 కంప్లీట్ అయిపోతుంది. మరి నవంబర్ చివరి వారంతో పాటు చివరి నెల అయిన డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీ మరియు థియేటర్లలో విడుదల కానున్న మూవీస్ అండ్ సిరీస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

హిట్ 2..

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద నేచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన ‘హిట్ – ది ఫస్ట్ కేస్’.. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ఫిలిం ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. హిందీలో రాజ్ కుమార్ రావుతో శైలేష్ కొలను రీమేక్ చేయగా మంచి స్పందన వచ్చింది..

ఆ సస్పెన్స్‌ని కంటిన్యూ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడానికి ‘హిట్ – ది సెకండ్ కేస్’ రాబోతోంది. టాలెంటెడ్ యాక్టర్ కమ్ రైటర్ అడివి శేష్ హీరోగా.. నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్.. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

మట్టి కుస్తీ..

కోలీవుడ్ యంగ్ స్టార్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల భర్త.. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ హీరో హీరోయిన్లుగా.. మాస్ మహారాజా రవితేజ నిర్మాణంలో.. కుస్తీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మట్టి కుస్తీ’.. చెల్ల అయ్యావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 2న తమిళ్ (గట్ట కుస్తీ), తెలుగులో విడుదలవుతోంది.

జల్లికట్టు బసవ..

వెర్సటైల్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి మరో డబ్బింగ్ బొమ్మతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరో విలక్షణ నటుడు బాబీ సింహాతో కలిసి నటించిన ‘జల్లికట్టు బసవ’ డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. తాన్య రవిచంద్రన్ హీరోయిన్. ఆర్.పన్నీర్ సెల్వం డైరెక్టర్..

నేనెవరు?..

బాలకృష్ణ కోల, గీత షా, రాజా రవీంద్ర, సాక్షి చౌదరి, ప్రభాకర్‌, రావు రమేష్, తాగుబోతు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో.. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో తెరెక్కిన ’నేనెవరు?’ సినిమా డిసెంబర్‌ 2న రిలీజ్‌ కానుంది.

ఓటీటీ సినిమాలు – వెబ్ సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్..

క్రైమ్ సీన్ టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్ – (వెబ్ సిరీస్) – నవంబర్ 29

మై నేమ్ ఈజ్ వెండెట్టా – (ఇటాలియన్ మూవీ) – నవంబర్ 30

ట్రోల్ – (నార్వేజియన్ మూవీ) – డిసెంబర్ 1

జంగిల్ లాండ్ (హాలీవుడ్) – డిసెంబర్ 1

గుడ్‌బై – (హిందీ) – డిసెంబర్ 2

లవ్‌టుడే (తమిళ్) – డిసెంబర్ 2

డిస్నీ+హాట్‌స్టార్..

విల్లో – (వెబ్ సిరీస్) – నవంబర్ 30

రిపీట్ (తెలుగు) – డిసెంబర్ 1

డైరీ ఆఫ్ ఎ వింపీకిడ్ : రోడ్రిక్ రూల్స్ – డిసెంబర్ 2

ఫ్రెడ్డీ (బాలీవుడ్) – డిసెంబర్ 2

మాన్‌స్టర్ (మలయాళం) – డిసెంబర్ 2

జీ5..

ఇండియన్ లాక్‌డౌన్ (బాలీవుడ్) – డిసెంబర్ 2

మాన్‌సూన్ రాగా (బాలీవుడ్) – డిసెంబర్ 2

అమెజాన్ ప్రైమ్ వీడియో..

క్రష్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 2) – డిసెంబర్ 2

కాంతార (తుళు) – డిసెంబర్ 2

వదంతి – (వెబ్ సిరీస్) – డిసెంబర్ 2

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus