Weekend Releasing Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీ లో విడుదల కాబోతున్న 20 సినిమాలు…!

అక్టోబర్ ఆరంభంలో రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’, ‘స్వాతి ముత్యం’ వంటి చిత్రాలు ఈ దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో జనాలను ధియేటర్ కు రప్పించలేకపోయాయి. ఇక దీపావళి వరకు పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు లేవు. కాబట్టి ఈ వీకెండ్ కు చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాల హవా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి.ఈ సినిమాలు అన్నీ ధియేటర్ కు క్యూ కట్టాయి.ఈ వారం 7,8 చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇందులో మినిమం బజ్ ఉన్న సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతో ఈ వారం కూడా ఓటీటీలకే జనాలు ఓటేసే అవకాశం ఉంది. ఈ వారం ధియేటర్ మరియు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1)క్రేజీ ఫెలో : ఆది సాయికుమార్‌ హీరోగా ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌’ లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

2)బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ : విశ్వంత్‌, మాళవిక సతీషన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. దర్శకుడు కంభంపాటి తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కానుంది.

3)కాంతార : ‘కె.జి.ఎఫ్’ సిరీస్ ను నిర్మించిన ‘హోంబలే ఫిలింస్’ సంస్థలో దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘కాంతారా’. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకున్నాయి. కన్నడలో సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అక్టోబర్ 15న ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది.

4)గీత : ‘గ్రాండ్ మూవీస్’ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథా చిత్రం ‘గీత’. వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో సునీల్ కూడా ముఖ్యపాత్ర పోషించాడు.అక్టోబర్ 14 న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

5)రారాజు : కె.జి.ఎఫ్ హీరో యష్ నటించిన చిత్రం ‘రారాజు’ అనే కన్నడ డబ్బింగ్ చిత్రం అక్టోబర్ 14న తెలుగులో రిలీజ్ కానుంది.

6)లెహరాయి : బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘లెహరాయి’. అక్టోబర్ 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.

7)నిన్నే పెళ్లాడతా : ఈశ్వరీ ఆర్ట్స్, అంబికా ఆర్ట్స్ బ్యానర్లపై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా.. ‘పైసా’ మూవీ ఫేమ్ సిద్ధికా శర్మ హీరోయిన్ గా వైకుంఠ బోను దర్శకత్వంలో వెలుగోడు శ్రీధర్ బాబు, బొల్లినేని రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. అక్టోబర్ 14న గ్రాండ్ గా ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.

8)రుద్ర నేత్రి : ఈ మూవీ కూడా అక్టోబర్ 14 నే రిలీజ్ కానుంది.

9)నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా : జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.అక్టోబర్ 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.

10)రెబల్ : ప్రభాస్ – లారెన్స్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ అక్టోబర్ 15న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.

11) అడవి : నితిన్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “అడవి” సినిమాను అక్టోబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

12) నేను మీకు బాగా కావాల్సిన వాడిని : కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 14 (గురువారం) నుండి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ మరియు ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

13)అన్ స్టాపబుల్ సీజన్ 2 : అక్టోబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది.

15)సమ్ వన్ బారోడ్ : ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

16)దోబారా : తాప్సీ నటించిన ఈ బాలీవుడ్ మూవీ అక్టోబర్ 15 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

17)హోలీ ఫ్యామిలీ : ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

18)వెందు తనిందతు కాదు : ఈ తమిళ మూవీ అక్టోబర్ 13 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

19)ట్రిగర్ : ఈ తమిళ సినిమా అక్టోబర్ 14 నుండి ఆహా-తమిళ్లో స్ట్రీమింగ్ కానుంది.

20)గుడ్ బ్యాడ్ గర్ల్ : ఈ హిందీ మూవీ అక్టోబర్ 14 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus