2016 లో ఓవర్సీస్ లో అత్యధిక కలక్షన్స్ సాధించిన తెలుగు చిత్రాలు

  • December 23, 2016 / 02:24 PM IST

తెలుగు చిత్రాల పరిధి విస్తరించింది. పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మన సినిమాలను చూసే వారు పెరుగుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో టాలీవుడ్ ఫిలిమ్స్ భారీ కలక్షన్ల రాబడుతున్నాయి. అక్కడ క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి .. ఆ తరహా మూవీలు ఇక్కడ బోల్తా కొట్టినా అక్కడ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇలా 2016 లో విడుదలై అమెరికాలో అత్యధిక కలక్షన్స్ కొల్లగొట్టిన టాప్ టెన్ చిత్రాలపై ఫోకస్..

అ.. ఆ… $2,445,037యంగ్ హీరో నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన అ.. ఆ… సినిమా అమెరికాలో సంచలనం సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని అక్కడివారు కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేశారు. టోటల్ గా $2,445,037 వసూలు చేసి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.

నాన్నకు ప్రేమతో .. $2,022,392జూనియర్ ఎన్టీఆర్ కి ఓవర్సీస్ లో తక్కువ మార్కెట్ ఉంటుంది. ఆ పేరుని “నాన్నకు ప్రేమతో” సినిమా బ్రేక్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ హాలీవుడ్ హీరోలా కనిపించి సూపర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ సుకుమార్ ఇంటలిజంట్ స్క్రీన్ ప్లే తో క్లాస్ ఆడియన్స్ ని అలరించింది. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ఒక్క అమెరికాలోనే 2,022,392 డాలర్లు వసూలు చేసింది.

జనతా గ్యారేజ్ $1,800,404జనతా గ్యారేజ్ చిత్రంతో ఎన్టీఆర్ అన్ని రికార్డులను రిపేర్ చేశారు. కొరటాల శివ కథ, కథనం, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తోడవ్వడంతో జనతా గ్యారేజ్ ఈ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ గానిలిచింది. 135 కోట్లు రాబట్టి టాలీవుడ్ సింహాసనాన్ని దక్కించుకున్న ఈ మూవీ కలెక్షన్లలో అమెరికా వాటా 1,800,404 డాలర్లు.

ఊపిరి $1,569,162కింగ్ నాగార్జున వీల్ చైర్ లో కూర్చొని చేసిన నటనకు అమెరికా వాసులు జేజేలు పలికారు. తమిళ నటుడు కార్తీ తో కలిసి నాగ్ చేసిన “ఊపిరి” విడుదలైన అన్ని థియేటర్లలో కనక వర్షం కురిపించింది. అమెరికాలో 1,569,162 డాలర్లు రాబట్టింది.

ధృవ $1,231,468.00 (10 రోజులకు మాత్రమే)మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ చిత్రం ద్వారా మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. మైండ్ గేమ్ తో సాగే ఈ మూవీతో ఓవర్సీస్ లో చెర్రీ రికార్డులకు తెరలేపారు. విడుదలైన మొదటి వీక్ లోనే అమెరికాలో ఒక మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసింది. లాంగ్ రన్ లో రెండు మిలియన్ పైగా సాదిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెళ్లిచూపులు $1,222,644అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన పెళ్లిచూపులు విజయం చిన్న చిత్రాల నిర్మాతలకు మంచి బలాన్ని ఇచ్చింది. విజయ్ దేవరకొండ, రీతూ లు హీరో హీరోయిన్లుగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ మెప్పుఅందుకుంది. అమెరికాలో 1,222,644 డాలర్లు రాబట్టి అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించింది.

బ్రహ్మోత్సవం $1,157,978అమెరికాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన సినిమాలు ఇక్కడ బాగా ఆడక పోయినా అక్కడ మంచి కలక్షన్స్ సాధిస్తాయి. ఆ విషయాన్నీ బ్రహ్మోత్సవం మరోసారి నిరూపించింది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ 1,157,978 డాలర్లు రాబట్టింది.

సర్దార్ గబ్బర్ సింగ్ $1,070,404పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ హీరో. అతని చిత్రాలను మొదటి రోజు చూడాలని చాలా మంది యువత తాపత్రయపడుతుంటారు. అందుకే విడుదల రోజు మిడ్ నైట్ షోల హడావుడి ఉంటుంది. అలా గబ్బర్ సింగ్ సీక్వెల్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ బాగాలేనప్పటికీ మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది. అమెరికాలో ఈ చిత్రం మొత్తం మీద 1,070,404 డాలర్లు వసూలు చేసింది.

జెంటిల్ మన్ $907,672నేచురల్ స్టార్ నాని క్రమక్రమంగా స్టార్ హీరో అవుతున్నారు. ఆయన సినిమాలు విదేశాల్లోనూ బాగా ఆడుతున్నాయి. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘అష్టా చమ్మా’ తర్వాత నాని చేసిన జెంటిల్ మన్ ఈ ఏడాది విడుదలై మంచి పేరుతో పాటు భారీ కలక్షన్స్ అందుకుంది. డ్యూల్ రోల్ లో నాని ప్రదర్శనకు అమెరికాలో $907,672 డాలర్ల వర్షం కురిసింది.

సరైనోడు $879,865స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్థాయి పెంచిన చిత్రం సరైనోడు. ఈ చిత్రం విడుదల అయిన కొత్తల్లో మిశ్రమ టాక్ తెచ్చుకున్నప్పటికీ లాంగ్ రన్లో రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 127 కోట్లు వసూల్ చేసిన ఈ చిత్రం అమెరికా షేర్ 879,865 డాలర్లు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus