టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్.. ఈ ముగ్గురి హీరోలకు మంచి స్నేహ బంధం ఉంది. 2018 లో ఈ ముగ్గురు హీరోలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాగా సందడి చేసారు. ఈ ముగ్గురు హీరోలలో రాంచరణ్ మొదట ‘రంగస్థలం’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ ను సాధించాడు. సమ్మర్ కానుకగా ముందు వరుసలో వచ్చిన ఈ చిత్రంతో అప్పటి వరకు ఉన్న నాన్ -బాహుబలి రికార్డులను క్లీన్ స్వీప్ చేసింది. అంతే కాదు ‘బాహుబలి’ తరువాత 200 కోట్ల గ్రాస్ సంపాదించిన ఏకైక చిత్రం ‘రంగస్థలం’.
ఇక ఈ చిత్రం తరువాత సమ్మర్లో ‘భరత్ అనే నేను’ చిత్రంతో వచ్చాడు మహేష్. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కూడా మంచి టాక్ ను సంపాదించుకుని, మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే ‘అవెంజర్స్’ ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ‘మహానటి’ వంటి చిత్రాలు వరుసగా రావడంతో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. అయితే ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ వంటి భారీ డిజాస్టర్స్ నుండీ మహేష్ కు మంచి రిలీఫ్ ను ఇచ్చింది ‘భరత్ అనే నేను’ చిత్రం.
ఇక యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో దసరా కానుకగా విడుదలయ్యింది ‘అరవింద సమేత’ చిత్రం. ఈ చిత్రం కూడా మంచి రివ్యూలు, మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. కానీ ఈ చిత్రం కూడా ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. జూ.ఎన్టీఆర్ చిత్రాలకి ఎంత హిట్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమనే.. రూమర్ మరోసారి ప్రూవ్ చేసింది ‘అరవింద సమేత’. అయితే 2018 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ కు మాత్రం ‘అరవింద సమేత’ చిత్రం మంచి రిలీఫ్ ను ఇచ్చిందని చూపొచ్చు.
ఇక ఈ ముగ్గురు హీరోలలో.. 2018 కి గానూ ‘హీరో ఆఫ్ ది ఇయర్’ ఎవరంటే కచ్చితంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ అనే చెప్పాలి. కేవలం కలెక్షన్స్ విషయంలోనే కాదు.. ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబు పాత్రలో తన విశ్వరూపం చూపించాడు. ‘మగధీర’ తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ ను సాధించాడు రాంచరణ్. సరైన పాత్ర దొరకాలే గాని.. తన ఏ రేంజ్ ఇన్పుట్ ఇస్తాడు అన్నదానికి ‘రంగస్థలం’ చిత్రం ఒక నిదర్శనం.