2021 బాక్సాఫీస్ : మొదటి 3 నెలల రివ్యూ..!

2020 వ సంవత్సరం మొదటి మూడు నెలలు పూర్తవ్వకుండానే థియేటర్లు మూతపడ్డాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ ఏర్పడడంతో షూటింగ్ దశలో ఉన్న సినిమాలు సైతం అర్దాంతరంగా ఆగిపోయాయి. డిసెంబర్ నెలాఖరు వరకూ.. అంటే దాదాపు 9నెలల వరకూ థియేటర్లు తెరుచుకోలేదు. అయితే మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే మన టాలీవుడ్ తొందరగానే కోలుకుంది అని చెప్పాలి. 2021 ప్రారంభం అవ్వడం.. అప్పుడే 3 నెలలు గడిచిపోవడం జరిగింది. ఈ 3 నెలల్లో ఎన్నో మీడియం రేంజ్ సినిమాలు మరియు చిన్నా చితకా సినిమాలు విడుదలయ్యాయి. ఎక్కువగా ఓటిటిని టార్గెట్ చేసుకుని రూపొందిన సినిమాలను సైతం థియేటర్లు ఓపెన్ అయ్యాయి కదా అని విడుదల చేశారు. వాటి ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు.

అయితే కాస్త క్రేజ్ ఉన్న సినిమాలను భారీ స్థాయిలో ప్రమోట్ చేసి విడుదల చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.మరి కొన్ని సినిమాలు హిట్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ ను సాధించలేకపోయాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) బంగారు బుల్లోడు :

అల్లరి నరేష్ హీరోగా గిరి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం జనవరి 23న విడుదలయ్యి మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూట కట్టుకుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద కూడా ప్లాప్ గానే మిగిలింది.

2) ఎఫ్.సి.యు.కె :

జగపతి బాబు ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా ‘అల మొదలైంది’ నిర్మాతలు కావడంతో సినిమాని భారీగా ప్రమోట్ చేశారు.ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో ఘోర పరాజయం పాలయ్యింది.

3) కపటదారి :

సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదలయ్యింది. సినిమాకి హిట్ పాజిటివ్ టాకే వచ్చింది. కానీ సుమంత్ బ్యాడ్ ఫామ్ వలన బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మిగిలింది.

4) చక్ర :

విశాల్ నటించిన ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 19నే విడుదలయ్యింది. కానీ ప్లాప్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా జోరు చూపించలేకపోయింది.

5) చెక్ :

నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదలయ్యింది. ఈ సినిమాకి కూడా హిట్ టాకే వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలింది.

6) షాదీ ముబారక్ :

దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 5న విడుదలయ్యింది. పద్మశ్రీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

7) గాలి సంపత్ :

శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఈ చిత్రం మార్చి 11న విడుదలయ్యి డిజాస్టర్ గా మిగిలింది.

8) శ్రీకారం :

శర్వానంద్ హీరోగా కిషోర్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం కూడా మార్చి 11నే విడుదలయ్యింది.సినిమాకి పాజిటివ్ టాకే వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలింది.

9) చావు కబురు చల్లగా :

అల్లు అరవింద్ గారి చిన బ్యానర్ అయిన ‘జిఎ2 పిక్చర్స్’ బ్యానర్ పై కార్తికేయ హీరోగా ఈ చిత్రం రూపొందింది. ఎన్నో అంచనాల నడుమ మార్చి 19న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది.

10) మోసగాళ్ళు :

విష్ణు, కాజల్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం కూడా మార్చి 19నే విడుదలయ్యింది. సినిమా పై మంచి అంచనాలే ఏర్పడినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపించలేక డిజాస్టర్ అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus