2022.. అంచనాలను తారుమారు చేసిన సినిమాలు!

2022 టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ సినిమాలు చాలానే విడుదలయ్యాయి. కానీ కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రూపంలో దేశం మొత్తం గర్వించదగ్గ సినిమా వచ్చినప్పటికీ.. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ‘సాహో’తో నిరాశపరిచారు. ‘రాధేశ్యామ్’తో కచ్చితంగా హిట్ కొడతారని అందరూ అనుకున్నారు. సినిమాను చాలా గ్రాండ్ గా, భారీ బడ్జెట్ తో నిర్మించారు. విజువల్స్ అన్నీ ఆకట్టుకున్నప్పటికీ.. ఈ స్టోరీ ప్రభాస్ ఇమేజ్ కి సరిపోలేదు. దీంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు.

ఆచార్య: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. రిలీజ్ కు ముందు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తండ్రీకొడుకులు నటించిన సినిమా కచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని భావించారు. కానీ తీరా రిలీజైన తరువాత డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది ఎక్కువ మంది ట్రోల్ చేసిన సినిమాల్లో ‘ఆచార్య’ కూడా ఒకటి. అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ ఇలాంటి సినిమా తీస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాను కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయారు.

లైగర్: ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ చేసిన హడావిడి అంత ఈజీగా మరిచిపోలేం. ఈ సినిమా ఇండియాను షేక్ చేస్తుందంటూ బోలెడన్ని మాటలు చెప్పారు. విజయ్ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. కానీ సరైన కథ, కథనాలు లేకపోవడంతో సినిమా ప్లాప్ అయింది. ఈ సినిమా భారీ నష్టాలు మిగల్చడంతో బయ్యర్లకి, పూరికి మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది.

అక్కినేని నాగార్జున నటించిన ‘ఘోస్ట్’ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. అలానే నాగచైతన్య నటించిన ‘థాంక్యూ’ కూడా వర్కవుట్ అవ్వలేదు. అలా అక్కినేని హీరోలు ప్లాప్స్ మూటగట్టుకున్నారు.

మాస్ హీరో రవితేజ ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు అందుకున్నారు. ఇప్పుడు ఆయన నటించిన ‘ధమాకా’ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. దీంతోనైనా హిట్ అందుకుంటారేమో చూడాలి.

ఈ సినిమాలతో పాటు శర్వానంద్ నటించిన ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, సుధీర్ బాబు నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్ ‘ది వారియర్’, మంచు విష్ణు ‘జిన్నా’ ఇలా చాలా సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus