Oscar Nominations: ఆస్కార్‌ నామినేషన్లు వచ్చేశాయ్‌… ఈ సారి ఏయే సినిమాలో బరిలో ఉన్నాయంటే?

సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ప్రపంచ ప్రఖ్యాత సినిమా పండగ ‘ఆస్కార్స్‌ 2025’కి (Oscar) రంగం సిద్ధమైంది. ఈ సారి అవార్డుల కోసం పోటీ పడుతున్న సినిమాల జాబితాను అకాడమీ అవార్డ్స్‌ ప్రకటించింది. మార్చి 2న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కోనన్‌ ఓబ్రియాన్‌ ఈసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ముఖ్యమైన కేటగిరీలు, ఆ అవార్డులో కోసం బరిలో నిలిచినవాళ్ల జాబితా ఇదీ..

Oscar Nominations:

ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘అనోరా’, ‘ది బ్రూటలిస్ట్‌’, ‘ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌’, ‘కాన్‌క్లేవ్‌’, ‘డ్యూన్‌: పార్ట్‌ 2’, ‘ఎమిలియా పెరెజ్‌’, ‘ఐయామ్‌ స్టిల్‌ హియర్‌’, ‘నికెల్‌ బాయ్స్‌’, ‘ది సబ్‌స్టాన్స్‌’, ‘విక్డ్‌’ ఉన్నాయి. ఉత్తమ దర్శకుడు విభాగంలో సీన్‌ బేకర్‌ (అనోరా), బ్రాడీ కార్బెట్‌ (ది బ్రూటలిస్ట్‌), జేమ్స్‌ మ్యాన్‌గోల్డ్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌), జాక్వెస్‌ ఆడియార్డ్‌ (ఎమిలియా పెరెజ్), కోరలీ ఫార్గేట్‌ (ది సబ్‌స్టాన్స్‌) ఉన్నారు.

ఉత్తమ నటుడు విభాగానికి వస్తే అడ్రియాన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌), తిమోతీ చాలమెట్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌), కోల్‌మెన్‌ డొమినింగో (సింగ్‌సింగ్‌), రే ఫియన్నెస్‌ (కాన్‌క్లేవ్‌), సెబస్టియన్‌ స్టాన్‌ (ది అప్రెంటిస్‌) నిలవగా.. ఉత్తమ నటి కేటగిరీలో సింథియా ఎరివో (విక్డ్‌), కార్లా సోఫియా గాస్కన్‌ (ఎమిలియా పెరెజ్), మికే మాడిసన్‌ (అనోరా), డెమి మూర్‌ (ది సబ్‌స్టాన్స్‌), ఫెర్నాండా టోర్రెస్‌ (ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌) ఉన్నారు.

ఉత్తమ సహాయ నటుడు సెక్షన్‌లో యురా బోరిసోవ్‌ (అనోరా), కిరెన్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌), ఎడ్వర్డ్‌ నార్తన్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌), గాయ్‌ పియర్స్‌ (ది బ్రూటలిస్ట్‌), జెరీమీ స్ట్రాంగ్‌ (ది అప్రెంటిస్‌) నిలిచారు. ఉత్తమ సహాయ నటి పురస్కారం కోసం మోనికా బార్బరో (ది కంప్లీట్‌ అన్‌నోన్‌), అరియానా గ్రాండే (విక్డ్‌), ఫెసిలిటీ జోన్స్‌ (ది బ్రూటలిస్ట్‌), ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్‌క్లేవ్‌), జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్) బరిలో నిలిచారు.

ఈ ఏడాది మన దేశం నుండి ఆస్కార్‌ (Oscar) నామినేషన్లలో ‘అనూజ’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ నిలిచింది. ఆడమ్‌ జే గ్రేవ్స్‌ తెరకెక్కించిన ఈ సినిమా లైవ్‌ యాక్షన్‌ విభాగంలో బరిలోకి దిగింది. గునీత్‌ మోంగా నిర్మించిన దీనికి బాలీవుడ్‌ నాయిక ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.

ఐటీ రెయిడ్స్ పై హీరో వెంకటేష్ కామెంట్.. వైట్ మనీ అంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags