‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చి సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకున్న నేపథ్యంలో, ఈ చిత్రం సక్సెస్ మీట్ నిర్వహించబడింది. అయితే, నిర్మాత దిల్ (Dil Raju) రాజుపై జరుగుతున్న ఐటీ దాడుల నేపథ్యంలో ఈ ఈవెంట్ మరింత ఆసక్తి కలిగించింది. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) , హీరో వెంకటేష్ (Venkatesh Daggubati), మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో, ఐటీ దాడులపై అనిల్ రావిపూడి సరదాగా, కానీ స్పష్టతతో స్పందించారు. “ఇండస్ట్రీలో ఐటీ దాడులు సర్వసాధారణం. దిల్ రాజు మమ్మల్ని సక్సెస్ మీట్ ఆపవద్దని చెప్పారు.
ఆయన ఎంతో ధైర్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు,” అని అనిల్ చెప్పారు. మేకర్స్ సినిమా కలెక్షన్ల పోస్టర్లను విడుదల చేయడం వల్లనే ఈ దాడులు జరిగాయని వస్తున్న ప్రచారంపై, అనిల్ స్పందిస్తూ, “మా నంబర్లు జీఎస్టీతో సహా ఖచ్చితంగా ఉంటాయి. మా సినిమాకు ప్రేక్షకుల ఆదరణ వందశాతం నిజం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో సాధించిన విజయానికి గర్వపడుతున్నాం,” అన్నారు. ఒక జర్నలిస్ట్ ‘సుకుమార్ (Sukumar) ఇంట్లో సోదాలు జరుగుతుంటే మీ ఇంటికీ వస్తారా?’ అని ప్రశ్నించగా, అనిల్ నవ్వుతూ, “నేను ఇంకా సుకుమార్ ఇంటి పక్కనకి షిఫ్ట్ అవ్వలేదు.
ఫిబ్రవరిలో అవుతాను. అప్పుడు వచ్చినా ఆశ్చర్యపోను,” అని సరదాగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు హాలులో నవ్వులు పూయించాయి. ఇతర నిర్మాతలపై వస్తున్న ఆరోపణలతో పాటుగా హీరోల రెమ్యునరేషన్ విషయంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. హీరోలు వైట్ మనీ తీసుకుంటే, నిర్మాతలకు సమస్యలు తగ్గుతాయని చెప్పిన విషయంపై హీరో వెంకటేష్ స్పందించారు. “నాకు ఎంత రెమ్యునరేషన్ అవసరమో అంతే తీసుకుంటాను. అదీ వైట్‌లోనే.
ఎలాంటి బ్లాక్ మనీ వ్యవహారాల్లో నేను భాగం కాదు. పరిశ్రమలో మనం సరైన పద్దతిని పాటిస్తే ఇలాంటి సమస్యలే ఉండవు,” అన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే, నిర్మాతలపై ఐటీ దాడుల అంశం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సక్సెస్ మీట్‌తో డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.