2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2025 : గడిచిన సం.లో సినిమా ఈవెంట్స్ ఎన్ని జరిగాయో అన్ని కాంట్రవర్సి మాటలు నోరు జారారు మన నటులు మరియు దర్శకులు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే నోరు జారిన మాటలు, అవి దారి తీసిన వివాదాలే ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్నింటి గురించి చూసేద్దాం రండి.. 

గాంధీ జయంతి సందర్భంగా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, మహాత్మా గాంధీని కించపరుస్తూ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతటితో కాక ఆ సమయంలో అయన నటించిన ‘అరి’ చిత్రం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇది ఇలా ఉండగా, పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం టైటిల్ రీవీల్ చేయటానికి భారీ ఈవెంట్ ప్లాన్ చేయగా, అక్కడ ఏర్పడిన టెక్నికల్ లోపంతో కొద్దీ నిమిషాల పాటు ఈవెంట్ డిస్టర్బ్ అవడంతో దర్శకుడు రాజమౌళి హనుమాన్ పై నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. 

 

2026 సంక్రాంతి బరిలో ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ నిలవనున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మూవీ దర్శకుడు మారుతీ ఒక ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు పక్క హీరో అభిమానులను ఇబ్బంది పెట్టాయి. సదరు హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేయటంతో మారుతీ వివరణ ఇస్తూ వీడియో పెట్టుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గా శివాజీ తాను నటించిన ‘దండోరా’ చిత్రం కి సంబందించిన ఈవెంట్ లో ఆడవారి వస్త్ర ధారణపై చేసిన వ్యాఖ్యలు కొంచం ఇబ్బందిగా ఉండటంతో చివరకి రాష్ట్ర మహిళా కమిషన్ కి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ పరిణామాలను చూస్తుంటే మాట జారటం చాల ఈజీ యే కానీ దానిని వెనక్కి తీసుకోవటం అంత ఈజీ కాదు. ఆ వ్యాఖ్యలు సమాజాన్ని ఎంత వరకు ప్రభావితం చేస్తాయో తెలుసుకొని ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  

 

 

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus