రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడి కొడుకైన ప్రభాస్ 2002 సంవత్సరంలో ఈశ్వర్ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇచ్చిన సంగతి తెల్సిందే. ఆ తరువాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి చిత్రాలతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. రాజమౌళి పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన “బాహుబలి” మూవీ , భారతీయ చలన చిత్ర చరిత్రలో 1000 కోట్లు దాటిన మొదటి చిత్రంగా రికార్డుల కెక్కింది. దీంతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ గా ఎదిగాడు ప్రభాస్.
బాహుబలి తరువాత సాహో , రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అంతగా మెప్పించకపోయినా KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు ప్రభాస్. తరువాత అశ్విన్ డైరెక్షన్లో సైన్టిఫిక్ ఫిక్షన్ గా రూపొందిన కల్కి 2898 మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న “రాజాసాబ్” మూవీ షూటింగ్ లో బిజీ బిజీగా వున్నారు ప్రభాస్. ఈ మూవీ లో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ , రిధి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని T G విశ్వప్రసాద్, ఇషాన్ సక్సేనా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్టు దర్శకుడు మారుతీ X వేదికగా ఈ విధంగా తెలియజేసారు. “23 ఏళ్ల క్రితం ఆయన సినిమా ప్రపంచంలోకి తొలి అడుగు వేశారు. అదే రోజున ఇప్పుడు రాజాసాబ్ ప్రయాణాన్ని ముగించారు… ఆయన విజయయాత్రలో భాగమయ్యే అదృష్టం, దీవెన రెండూ మాకే లభించాయి… రాజాసాబ్ ఒక ఫ్రెష్ క్యారెక్టర్ తో పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందించబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాకు తెలుసు మీ ప్రేమ, మీ ఆత్రుత ఎంత ఉందో , మేము ది బెస్ట్ యే అందిస్తాం అని హామీ ఇస్తున్నాం… మా రెబెల్ గాడ్ భక్తులందరికీ మరిన్ని సంబరాల రోజులు రాబోతున్నాయి! అని అన్నారు.