మన టాలీవుడ్ స్టార్ హీరోల ‘మైల్ స్టోన్’ మూవీస్

25,50,100 ఇవి చూడటానికి ‘రౌండ్ ఫిగర్’ నంబర్లులా కనిపిస్తున్నప్పటికీ కొందరి జీవితాలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటాయి. ముఖ్యంగా క్రికెటర్లు, సినీ నటులకి ఈ నంబర్లు ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో హీరోలకి తమ 25, 50 వ చిత్రాలు ‘మైలురాయి ‘ లాంటిదన్నమాట. ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ సినిమా అయిన ‘మహర్షి’ చిత్రంతో మనముందుకు వస్తున్నాడు.

అయితే ఇప్పటి వరకూ మన టాలీవుడ్ హీరోలకి ‘మైల్ స్టోన్’ చిత్రం వంటి 25 వ చిత్రాలని ఓ సారి చెక్ చేద్దాం రండి :

1) నందమూరి తారక రామారావు : ఇద్దరు పెళ్ళాలు


టాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా ఎదిగిన రామారావు గారు. ఎఫ్. నాగూర్ గారు తన సొంత సంస్థలో నిర్మించి డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’.

2) అక్కినేని నాగేశ్వర రావు : బ్రతుకు తెరువు


‘అక్కినేని 25’ వ చిత్రమైన ‘బ్రతుకు తెరువు’ చిత్రాన్ని పి.ఎస్.రామకృష్ణారావు డైరెక్ట్ చేసారు. కోవెలమూడి భాస్కర్ రావు గారు నిర్మించిన ఈ చిత్రంలో ‘మహానటి’ సావిత్రి గారు హీరోయిన్ గా నటించారు.

3) ఘట్టమనేని కృష్ణ :బొమ్మలు చెప్పిన కథ


అతి తక్కువ సమయంలో 25 చిత్రాల మైలు రాయిని చేరుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. అయన నటించిన 25 వ చిత్రం ‘బొమ్మలు చెప్పిన కథ’. జి.విశ్వనాథం గారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు.

4) కొణిదెల చిరంజీవి – న్యాయంకావాలి

మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గారి 25 వ చిత్రం ‘న్యాయంకావాలి’. ఈ చిత్రాన్ని ఏ.కోందండ రామిరెడ్డి గారు డైరెక్ట్ చేసారు. చిరంజీవి గారు మెగాస్టార్ గా ఎదగడానికి డైరెక్టర్ కోందండ రామిరెడ్డి గారి పాత్ర చాలా ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘న్యాయంకావాలి’. అప్పటి రోజుల్లో 5 లక్షణాల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచి.. 100 రోజులు ఆడింది. ఈ చిత్రానికి చిరంజీవి 10,000 రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

5) నందమూరి బాలకృష్ణ – నిప్పులాంటి మనిషి

ధర్మేంద్ర హిందీలో చేసిన ‘క్వాయామత్’ మూవీ ను తెలుగులో బాలయ్య 25 వ చిత్రం ‘నిప్పులాంటి మనిషి’ చిత్రంగా తీశారు. బాలయ్య 25 వ మైలురాయి గా రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్.బి.చక్రవర్తి డైరెక్ట్ చేసారు. రాధా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది.

6) అక్కినేని నాగార్జున – జైత్ర యాత్కింగ్ నాగార్జున 25 వ చిత్రమైన ‘జైత్ర యాత్ర’ ను ఉప్పలపాటి నారాయణ రావు గారు డైరెక్ట్ చేసారు. తనికెళ్ళ భరణి కథ అందించిన ఈ చిత్రంలో నాగార్జున నటనకి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా పర్వాలేదనిపించింది.

7)విక్టరీ వెంకటేష్ – కొండపల్లి రాజా


రజినీకాంత్ నటించిన తమిళ చిత్రం ‘అన్నమలై’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ 25 వ చిత్రంగా తెరకెక్కించాడు రవిరాజా పినిశెట్టి. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

8) పవన్ కళ్యాణ్ : అజ్ఞాతవాసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కు 25 వ చిత్రం. ఈ చిత్రం రిలీజ్ కు ముందు భారీ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకోలేకపోయింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు కల్లెక్షన్లను మాత్రం ఇప్పటి వరకూ మరే స్టార్ హీరో చిత్రం క్రాస్ చేయలేకపోతోంది. ఇది పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ పవర్ అనడంలో సందేహం లేదు.

9) మహేష్ బాబు : మహర్షి


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం మే 9 న(రేపు) విడుదల కాబోతుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు,అశ్వినీదత్, పీవీపీ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని మహేష్ మంచి నమ్మకంతో ఉన్నాడు.

10)జూ.ఎన్టీఆర్ : నాన్నకు ప్రేమతో


ఎన్టీఆర్ 25 వ చిత్రంగా వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేశాడు. 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. అయితే ఎన్టీఆర్ కు మొదటి 50 కోట్ల షేర్ ను రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం.

11)రవితేజ : కిక్


మాస్ మహారాజ్ 25 వ చిరమైన కిక్ ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం 2009 సమ్మర్ కానుకగా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఈ చిత్రాన్ని టీవీ లో చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు మన ప్రేక్షకులు.

12) గోపీచంద్ : పంతం


‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కొన్ని ఆర్ధిక సమస్యల విలన్ గా నటించాడు గోపిచంద్. తరువాత మళ్ళీ హీరోగా మారి వరుస హిట్లందుకున్నాడు. అయితే కె.చక్రవర్తి అనే కొత్త డైరెక్టర్ తో తన 25 వ చిత్రమైన ‘పంతం’ చిత్రం చేసాడు. అయితే గోపీచంద్ పంతం మాత్రం నెగ్గలేదు. ఈ చిత్రం ప్లాప్ గా మిగిలింది.

13) నితిన్ : ఛల్ మోహన్ రంగ


కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లందుకుని తరువాత 12 ప్లాపులు తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడ్డ ఏకైక హీరో నితిన్. ఇక చాలా గ్యాప్ తరువాత ‘ఇష్క్’ నుండీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ క్రమంలో తన 25 వ చిత్రం కృష్ణ చైతన్య డైరెక్షన్లో ‘ఛల్ మోహన్ రంగ’ చేసాడు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి నిర్మించారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది.

14) నాని : ‘వి’


నాని ని ‘అష్టాచమ్మా’ చిత్రంతో హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తన 25 వ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. ‘వి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా తన కెరీర్లో మంచి హిట్ గా నిలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు నాని.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus