మెగాహీరో సినిమాకి నష్టాలు తప్పవా..?

  • September 6, 2022 / 10:36 AM IST

మెగాహీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా చూసిన వారికి మేకింగ్ కోసం పెద్దగా ఖర్చు పెట్టి ఉండరనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఒకే ఇంట్లో చేశారు. అవుట్ డోర్ షూటింగ్ చాలా తక్కువ చేశారు. దీంతో పెద్దగా ఖర్చయి ఉండదని అనుకున్నారు. కలెక్షన్స్ రాకపోయినా.. నిర్మాతకు పెద్దగా నష్టాలు ఉండవని భావించారు.

కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. వడ్డీలు, పబ్లిసిటీ అంతా కలిపి ‘రంగ రంగ వైభవంగా’ సినిమాకి రూ.28 కోట్లు వరకు ఖర్చయిందని తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ తో రూ.21 కోట్లు వచ్చింది. మిగిలిన రూ.7 కోట్లు థియేటర్ నుంచి రావాల్సి ఉందట. ఆంధ్ర ఆరు కోట్ల మేరకు మార్కెట్ చేశారు. నైజాంలో సొంతంగా రిలీజ్ చేశారు. సినిమాకి మేకింగ్ పరంగా ఎక్కువ ఖర్చు అవ్వడానికి కారణం వడ్డీల భారమే అని తెలుస్తోంది.

సినిమా రెడీ అయినా.. విడుదల తేదీ వెంటనే దొరక్కపోవడంతో వడ్డీలను భరిస్తూ సినిమాను హోల్డ్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. అలానే టీమ్ ను ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి తిప్పడానికి రూ.30 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అలానే హైదరాబాద్ నగరంలో మెట్రో పిల్లర్స్ పై ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవడంతో ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చింది.

స్టార్ క్యాస్ట్ కూడా ఉండడంతో రెమ్యునరేషన్స్ కూడా ఎక్కువ అయ్యాయి. ఫైనల్ గా ఆరు కోట్ల డెఫిసిట్ తో విడుదలైన ఈ సినిమా థియేటర్ నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా. అంటే మరో ఐదు కోట్ల వరకు నిర్మాతలకు నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus