ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari). అనిల్ సుంకర ఈ చిత్రాన్ని తన ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిర్మించారు. ‘సామజవరగమన’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ కానుంది ఈ సినిమా.
టీజర్, ట్రైలర్స్ పెద్దగా బజ్ అయితే ఏమీ క్రియేట్ చేయలేదు. కానీ శర్వానంద్ కి సంక్రాంతి ట్రాక్ రికార్డ్ బాగుంది. ఆ ధైర్యంతోనే ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయ్యి మూలన పడి ఉన్న ఈ సినిమాని సడన్ గా సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చారు. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి.సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు.వారి టాక్ ప్రకారం… ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా సింపుల్ గా స్టార్ట్ అయ్యిందట.
హీరో శర్వానంద్ ఎంట్రీ కూడా హడావిడి లేకుండా నార్మల్ గా ఉందట. ఆ తర్వాత సీనియర్ నరేష్ పాత్రతో పలికించిన పంచ్ డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అంటున్నారు. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా లావిష్ గా ఉందట. సత్య, వెన్నెల కిషోర్, సుదర్శన్..ల కామెడీ బాగానే పండినట్టు చెబుతున్నారు. శర్వానంద్- సంపత్ రాజ్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కూడా నవ్వులు పూయించాయట.
సెకండాఫ్ వర్కౌట్ అయ్యింది అంటున్నారు. క్లైమాక్స్ ని డైరెక్టర్ సెన్సిబుల్ గా డీల్ చేసినట్టు చెబుతున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
#NariNariNadumaMurari Final Report !!
Hilarious entertainer with right mix of emotions.
Such a chilling vibe with Naresh character from start to end.
Sharwanand, Sakshi, Sampath & Samyuktha were fab in their roles.
Ram Abbaraju proved his mettle again as writer and director.…— Filmy Focus (@FilmyFocus) January 14, 2026