28 Degree Celsius Review in Telugu: 28 డిగ్రీస్ సి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నవీన్ చంద్ర (Hero)
  • షాలిని (Heroine)
  • ప్రియదర్శి, వైవా హర్ష (Cast)
  • అనిల్ విశ్వనాథ్ (Director)
  • సాయి అభిషేక్ (Producer)
  • శ్రవణ్ భరద్వాజ్ - శ్రీచరణ్ పాకాల (Music)
  • వంశీ పచ్చిపులుసు (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 04, 2025

నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి ప్రధాన పాత్రల్లో “పొలిమేర” ఫేమ్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం “28 డిగ్రీస్ సెల్సియస్”. 2016లో తెరకెక్కిన ఈ చిత్రం పలు కారణాల వల్ల అప్పుడు విడుదలవ్వలేకపోయింది. ఎట్టకేలకు 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 9 ఏళ్ల క్రితం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

28 Degree Celsius Review

కథ: కార్తీక్ (నవీన్ చంద్ర), అంజలి (షాలిని వడ్నికట్టి) కలిసి ఎంబీబీఎస్ చదువుతూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. మెంటల్ స్ట్రెస్ కారణంగా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి.. ఎల్లప్పుడూ 28 డిగ్రీల టెంపరేచర్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంజలికి.

దాంతో ఆమె ట్రీట్మెంట్ కోసం జార్జియా వెళతారు కార్తీక్ & అంజలి. అక్కడ వారికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఏమిటా పరిస్థితులు? వాటిని కార్తీక్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది “28 డిగ్రీస్ సెల్సియస్” కథాంశం.

నటీనటుల పనితీరు: 9 ఏళ్ల సినిమా కావడంతో.. నవీన్ చంద్ర నటన “అందాల రాక్షసి” సినిమాను గుర్తు చేస్తుంది. అతని స్క్రీన్ ప్రెజన్స్ & ఎమోషన్స్ ను పండించడంలో సిన్సియారిటీ మాత్రం కచ్చితంగా అలరిస్తాయి. షాలిని సహజసిద్ధమైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దేవయాని శర్మ క్యారెక్టర్ కి ఇచ్చిన ట్విస్ట్ బాగున్నప్పటికీ.. అది పూర్తిస్థాయిలో ఎలివేట్ అవ్వలేదు. ఇక ప్రియదర్శి, వైవా హర్ష కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: 9 ఏళ్ల తర్వాత సినిమాని రిలీజ్ చేయడమే ఎక్కువ అనుకున్నారో ఏమో కానీ.. కనీసం డి.ఐ కూడా చేయలేదు. అందువల్ల ఏదో ముబైల్ లో షూట్ చేసిన ఫుటేజ్ ను థియేటర్లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం కంటే శ్రవణ్ భరద్వాజ్ పాటలు బాగున్నాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉన్నప్పటికీ.. దాన్ని సరిగా వినియోగించుకోలేదు. సినిమా కోసం బానే ఖర్చు చేసారు, 2016లో అంతమంది ఆర్టిస్టులను జార్జియా తీసుకెళ్లడం, అక్కడ మంచి లొకేషన్స్ లో షూట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో, ఇన్నాళ్లపాటు సదరు ప్రొడక్ట్ ను హోల్డ్ చేసిన నిర్మాత సాయి అభిషేక్ ను అభినందించాల్సిందే. అయితే.. కాస్త ఖర్చు చేసి డి.ఐ కూడా చేయించి ఉంటే కనీసం చూడబుడ్డయ్యేది.

దర్శకుడు అనిల్ విశ్వనాథ్ హీరోయిన్ కండిషన్ విషయంలో కొత్త పాయింట్ ను అనుకున్నప్పటికీ.. మెయిన్ ట్విస్ట్ విషయంలో 2009లో వచ్చిన హాలీవుడ్ సినిమా “ఆర్ఫన్” (ORPHAN) నుంచి మరీ ఎక్కువగా ఇన్స్పైర్ అవ్వడం అనేది కాస్త హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు ఉన్న ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎగ్జైట్ చేయలేకపోయింది. అలాగే.. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. క్లైమాక్స్ లో ట్విస్ట్ అన్నీ ఒక్కొక్కటిగా వరుసబెట్టి రివీల్ అయిపోతాయి కానీ.. ఎక్కడా సరైన డ్రామా పండలేదు. సో, దర్శకుడిగా, కథకుడిగా అనిల్ విశ్వనాథ్ ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ: ఒక సినిమా కాస్త డిలే అయితేనే హీరోలు అలిగి ప్రమోషన్స్ కు కాదు కదా కనీసం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్టులు సైతం పెట్టడం లేదు. అలాంటిది.. నవీన్ చంద్ర సినిమా మీద అభిమానంతో, దర్శకనిర్మాతల మీద గౌరవంతో 9 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ సినిమాను తన శక్తిమేరకు ప్రమోట్ చేశాడు. ఆ విషయంలో మాత్రం అతడ్ని మెచ్చుకోవాలి. అంతకు మించి సినిమా గురించి విశ్లేషించడానికి ఏమీ లేదు.

ఫోకస్ పాయింట్: నవీన్ చంద్ర సిన్సియారిటీకి తగ్గ రిజల్ట్ కాదు!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus