బిగ్ బాస్4: టాస్క్ లో రాక్షసులు ఎలా గెలిచారో తెలుసా..?

7వ వారంలో బిగ్ బాస్ హౌస్ లో కొంటెరాక్షసులు – మంచిమనుషులు అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్క్. బిగ్ బాస్ సీజన్ 4 లో చాలావారాల తర్వాత ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ కి ఇంపార్టెన్స్ వచ్చింది. మంచిమనుషులు గెలవాలంటే రాక్షసులని మంచి మనుషులుగా మార్చాలి. దానికోసం బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లని చేయాలి. ఇక్కడే రింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రింగ్ లో మనుషులు ఉంటూనే బస్తాలని బయటకి విసిరేయాలి.అలాగే రింగ్ బయట రాక్షసులు ఉంటూ బస్తాలని రింగ్ లోపలకి వేయాలి. ఈ టాస్క్ లో రాక్షసులు విజయం సాధించారు. అయితే, వీళ్లు ఎలా గెలిచారు అనేది చాలామంది బిగ్ బాస్ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చెేసింది. నిజానికి బస్తాలని రింగ్ బయట పడేసే టైమ్ లో చాలా మిస్టేక్స్ చేసారు మనుషులు. నిజంగా ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు అనే క్లారిటీ హౌస్ మేట్స్ కి కూడా లేదు. అందుకే జడ్జిమెంట్ అనేది బిగ్ బాస్ కే వదిలేసారు. ఇక్కడ మూడు పాయింట్స్ కన్సిడర్ చేసి బహుశా బిగ్ బాస్ రాక్షసులని విన్నర్స్ గా ప్రకటించి ఉంటారు.

నెంబర్ 1 ఏంటంటే..

ఫస్ట్ బజర్ మోగగానే మనుషులు సర్కిల్ కి వచ్చేయాలి. సర్కిల్ లోనే ఉండాలి. ఇది ఫస్ట్ రూల్. మొదట్లోనే హారిక బస్తాని బయటపడేయడానికి సర్కిల్ నుంచి బయటకి వచ్చేసింది.

నెంబర్ 2 ఏంటంటే..

బయట ఉన్న బ్యాగ్ ని వాళ్లు సర్కిలోకి లాక్కున్నారు. సోహైల్ బస్తాని లోపలకి లాక్కున్నాడు. ఇది కూడా మనుషులు చేసిన మిస్టేక్ అని అవినాష్ అక్కడ బిగ్ బాస్ కి చెప్పాడు.

నెంబర్ 3 ఏంటంటే..

బస్తాలని బయటకి పడేయాలి.. కానీ మనుషులు స్మిమ్మింగ్ పూల్ లో పాడేశారు. రాక్షసులు వాటిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇక ఎప్పుడైతే లాస్ట్ ఎండ్ బజర్ మోగిందో అప్పుడు బస్తా సర్కిలోనే ఉంది. ఇది బిగ్ బాస్ కన్సిడర్ చేశాడు. అందుకే రాక్షసులు గెలిచారు. ఇదే పాయింట్ తో డ్రమ్స్ నింపే టాస్క్ లో మనుషులు గెలిచారు. ఎండ్ బజర్ మోగే సమయానికి స్మిమ్మింగ్ పూల్ లో డ్రమ్ మునిగి ఉంది. అందులో నీళ్లు ఉన్నాయి. అప్పుడు మనుషులు గెలిచినట్లుగా బిగ్ బాస్ చెప్పాడు. అంటే., ఇక్కడ ఎండ్ బజర్ మోగే సరికి ఎక్కడ ఏది ఉందో అదే కన్సిడర్ చేస్తాడు. అందుకే రింగ్ టాస్క్ లో రాక్షసులు గెలిస్తే నీళ్లు నింపే టాస్క్ లో మనుషులు టీమ్ గెలిచినట్లుగా చెప్పాడు బిగ్ బాస్.

Paritala Murthy – Exclusive

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus