నాగశౌర్య విభిన్న ప్రయోగం.. ఒకే సినిమాకి ముగ్గురు డైరెక్టర్లు

మన తెలుగులో ఇప్పటివరకూ ఎవరూ గట్టిగా ప్రయత్నించలేదు కానీ.. ఒక సినిమాకి ఇద్దరుముగ్గురు దర్శకులు పనిచేయడం అనేది మిగతా ఇండస్ట్రీల్లో ఆల్రెడీ ప్రయత్నించారు. ఇప్పుడు ఈ కొత్త తరహా పద్ధతిని తెలుగులో ప్రయత్నించేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకేంద్రులు కె.రాఘవేంద్రరావు. “బాహుబలి” చిత్రానికి సమర్పకునిగా పనిచేసిన ఆయన త్వరలోనే స్వయంగా సినిమాలు ప్రొడ్యూస్ చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. మొదటి ప్రయత్నంగా నాగశౌర్య హీరోగా ఓ విభిన్నమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రేమకథలో వైవిధ్యం ఏముంటుందా అనుకొంటున్నారా?. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకి దర్శకులు ఒక్కరు కాదు ముగ్గురు. రాఘవేంద్రరావు శిష్యులు లేదా ఆయన మెచ్చిన ముగ్గురు దర్శకులు ఈ చిత్రాణి డైరెక్ట్ చేయనున్నారు. ఆల్రెడీ క్రిష్ ఆన్ బోర్డ్ అయ్యాడు. ఈ సినిమాలో నాగశౌర్య ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ చేయనున్నాడు. ఒక్కో అమ్మాయితో ఒక్కో ప్రేమకథ. ఈ మూడు ప్రేమకథల్ని ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారన్నమాట. ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus