`రాజా ది గ్రేట్ చిత్రానికి మరింత వినోదం జ‌త కానుంది.!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజా ది గ్రేట్‌`. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ప‌టాస్‌, సుప్రీమ్ వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో స‌క్సెస్‌ను అందుకున్న యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈసినిమాను డైరెక్ట్ చేశారు. అక్టోబ‌ర్ 18న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. భ‌ద్ర త‌ర్వాత ర‌వితేజ‌, దిల్‌రాజు క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు ధీటుగా రాజా ది గ్రేట్ సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్‌తో స‌త్తా చాటింది.

టాలీవుడ్‌లో ..ఓ క‌మ‌ర్షియ‌ల్ హీరో పూర్తిస్థాయి అంధుడి పాత్ర‌లో న‌టించ‌డం తేలికైన విష‌యం కాదు. కానీ ర‌వితేజ క‌థ‌, అందులో పాత్ర‌కు ప్రాధాన్య‌మివ్వ‌డ‌మే కాక‌, ద‌ర్శ‌క నిర్మాత‌లపై న‌మ్మ‌కంతో ఈ సినిమాలో న‌టించారు. రవితేజ పాత్ర‌లో ఒదిగిపోయి, న‌టించిన తీరు అద్భుత‌మని..ర‌వితేజ ది గ్రేట్ అని ప్రేక్ష‌కులు అంటున్నారు. ఇప్ప‌టికే బాక్సాఫీస్ వ‌ద్ద సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. ఈ సినిమాతో భారీ విజ‌యాన్ని అందించిన ప్ర‌క్ష‌కుల‌కు ఇంకా వినోదాన్ని అందించ‌డానికి నిర్మాత దిల్‌రాజు ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎడిటింగ్‌లో తీసేసిన కామెడీ సీన్స్‌ను ఇప్పుడు సినిమాలో యాడ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఫ‌న్ రైడ్‌గా ఉన్న ఈ సినిమా ఈ సీన్స్ యాడింగ్ వ‌ల్ల మ‌రింత వినోదాన్ని ప్రేక్ష‌కుల‌కు పంచ‌నుంద‌న‌టంలో సందేహం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus