మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు ఈరోజు. దీంతో ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా హైదరాబాద్లో ఉన్న శిల్పకళా వేదికలో అతని పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. టాలీవుడ్ కి చెందిన బడా డైరెక్టర్లు, నిర్మాతలు ఈ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యంగా చరణ్ తో సినిమాలు చేయబోతున్న డైరెక్టర్లు, నిర్మాతలు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా.. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) కూడా హాజరయ్యాడు.
అతను రాంచరణ్ 16 వ (RC16/Peddi) సినిమాని డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది. ‘మైత్రి’ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బుచ్చిబాబు స్పీచ్ ఇస్తూ.. ‘#RC16 ‘ ప్రాజెక్టుకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. అదేంటి అంటే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్పుడే 3 పాటలు ఓకే అయిపోయాయట.
ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అప్పుడే ఆయన ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలు కంప్లీట్ చేశాడట. ‘ఉప్పెన’ (Uppena) కి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఎంత మంచి మ్యూజిక్ అందించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘#RC16 ‘ కి రెహమాన్ అంతకు మించి బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు అని.. బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు.
ఇంత షార్ట్ టైంలో ఓ పెద్ద హీరో సినిమాకు సంబంధించి 3 పాటలు ఫైనల్ చేయడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో దర్శకుడు బుచ్చిబాబుని మెచ్చుకోవాల్సిందే. సినిమా కూడా అతను ఇంతే ఫాస్ట్ గా తీస్తే కనుక.. అభిమానులు అతన్ని నెత్తిన పెట్టేసుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్