‘ఆదిపురుష్’ లో సీత ఎవరనేది క్లారిటీ వచ్చేది ఆరోజే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు. రాధా కృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘గోపి కృష్ణా మూవీస్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతో పాటు మరో రెండు భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రభాస్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఒక చిత్రం కాగా మరొకటి ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆది పురుష్’ చిత్రం కావడం విశేషం.

ఇదిలా ఉండగా.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అదే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇవ్వాలని ఈ 3 చిత్రాల నిర్మాతలు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘రాధే శ్యామ్’ చిత్రం టీజర్ ను అక్టోబర్ 23న విడుదల చెయ్యబోతున్నారట నిర్మాతలు. దాంతో పాటు ప్రభాస్- నాగ్ అశ్విన్ ల సైన్స్ ఫిక్షన్ మూవీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారట..!ఇప్పటికే ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నట్టు ఖరారు చేసారు దర్శకనిర్మాతలు.

మరి ఇంకేం అప్డేట్ ఇవ్వబోతున్నారో చూడాలి. అంతేకాదు ‘ఆది పురుష్’ చిత్రంలో రాముడిగా ప్రభాస్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే సీతగా ఎవరు కనిపించబోతున్నారు అనే విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. దానికి సంబంధించిన క్లారిటీ కూడా అదే రోజున వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి అక్టోబర్ 23న ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus