Radhe Shyam: ‘రాధే శ్యామ్’ కి 3 ఏళ్ళు.. అక్కడ తేడా కొట్టింది.. ఫలితం మారిపోయింది!

‘బాహుబలి'(సిరీస్) తర్వాత ప్రభాస్ (Prabhas) నుండి వచ్చిన ‘సాహో’ (Saaho) పెద్దగా ఆడలేదు. కానీ అది ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో చాటి చెప్పింది. అటు తర్వాత అంటే కోవిడ్ అయ్యాక.. ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ‘బాహుబలి’ (Baahubali) ‘సాహో’ వంటి యాక్షన్ సినిమాలు చేసి కొంచెం ఛేంజోవర్ కావాలనుకున్నాడో ఏమో కానీ.. ఒక కంప్లీట్ లవ్ స్టోరీ చేశాడు ప్రభాస్. ‘జిల్’ (Jil) ఫేమ్ రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) ఈ చిత్రానికి దర్శకుడు.

Radhe Shyam

‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.పూజా హెగ్డే (Pooja Hegde) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి 2020 లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఫైనల్ గా 2022 మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకులకి కానీ, అభిమానులకి కానీ హోప్స్ లేవు. కానీ రిలీజ్ ట్రైలర్ తో కొంచెం అందరి అటెన్షన్ ను డ్రా చేసింది.

విక్రమాదిత్య అనే పేరు మోసిన అస్ట్రాలజర్ ఒక అమ్మాయితో ప్రేమలో పడటం. తర్వాత ఆ అమ్మాయి ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలుసుకోవడం.., తర్వాత అతనే ప్రాణాపాయ స్థితిలో పడటం, చివరికి తన ప్రేయసికి ఎలా దగ్గరయ్యాడు?’ అనే లైన్ తో ఈ సినిమా రూపొందింది. ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా ‘రాధే శ్యామ్’ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ప్రభాస్ ఇమేజ్ ఈ సినిమాని డామినేట్ చేసేసింది. అభిమానులకి అస్సలు రుచించలేదు.

సినిమాలో హీరో విలన్ గ్యాంగ్ పై క్యారెట్లు వంటివి విసరడం, తర్వాత హాస్పిటల్లో చేసే కామెడీ వంటివి ట్రోలింగ్ స్టఫ్ మాదిరి అనిపిస్తాయి. ఓ కొత్త హీరో ఈ కథ చేసి ఉంటే ఆడియన్స్ కి ఒక కొత్త ఫీలింగ్ వచ్చేదేమో. కానీ ప్రభాస్ చేసే ఎలిమెంట్స్ ఇందులో ఏమీ ఉండవు. అందుకే బాక్సాఫీస్ వద్ద వీకెండ్ కే సర్దేసింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఫన్నీ సెటైర్లు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus