Adipurush: ఆదిపురుష్ పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్.. అలా జరిగితే చాలంటూ?

ప్రభాస్ రాముని పాత్రలో కృతిసనన్ సీత పాత్రలో సైఫ్ అలీ ఖాన్ రావణునిగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ వచ్చే నెల 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా నెల రోజులు ఉండటంతో తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆదిపురుష్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఆదిపురుష్ ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ మూవీ 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. మైథలాజికల్ సినిమాలలో ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

సరిగ్గా నెలరోజుల తర్వాత (Adipurush) ఆదిపురుష్ రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కావడంతో పాటు సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రభాస్ ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్ వేస్తుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీ సక్సెస్ సాధిస్తే భవిష్యత్తులో మరిన్ని మైథలాజికల్ సినిమాలలో ప్రభాస్ నటించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమాపై రోజురోజుకు నెగిటివిటీ తగ్గుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై సాధారణ అభిమానుల్లో సైతం అంచనాలు పెరుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమాను త్రీడీలో చూస్తే ఈ సినిమా మరింత ఎక్కువగా నచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus