ఈ మధ్య కాలంలో తెలుగులో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన సినిమాలు హిట్ అవుతున్నా వైవిధ్యం ఎక్కువైతే మాత్రం సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. నిన్న విడుదలైన అరణ్య సినిమా వైవిధ్యం ఎక్కువైన జాబితాలోకే చేరుతుంది. కథపరంగా బాగానే ఉన్నా ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం లేని అరణ్య సినిమా మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లపరంగా కూడా అరణ్య సినిమా వీక్ గానే ఉండటం గమనార్హం. అయితే అరణ్య సినిమా సెన్సార్ సర్టిఫికెట్ లో ఉన్న నిడివికి నిన్న రిలీజైన సినిమా నిడివికి అరగంట తేడా ఉందనే సంగతి తెలిసిందే.
సినిమా ఫలితాన్ని ముందుగానే ఊహించిన సురేష్ బాబు, రానా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా అరగంట సినిమా కట్ చేసినట్లు తెలుస్తోంది. తక్కువ లెంగ్త్ తో సినిమాను రిలీజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని సురేష్ బాబు, రానా భావించగా ట్రిమ్ చేసినా ఫలితం మాత్రం మారలేదు. కట్ చేసిన సన్నివేశాల్లో మరో హీరో విష్ణు విశాల్ కు సంబంధించిన సీన్లే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. రానా కెరీర్ లో అరణ్య ఫ్లాప్ గా నిలిచినా నటుడిగా మాత్రం రానాకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ సినిమాలో రానా నటనకు అవార్డులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో డాక్యుమెంటరీ టైప్ సినిమాను ప్రేక్షకులు ఆదరించే పరిస్థితులు సినిమా ఇండస్ట్రీలో లేవు. మరోవైపు ఈ సినిమా తక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదల కావడంతో తొలిరోజు భారీగా కలెక్షన్లు రాలేదని తెలుస్తోంది. రానా సోలోగా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్యూర్ కావడం గమనార్హం. దాదాపు 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏ మేరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.