’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ ప్రదీప్ కాదు సత్యదేవ్ అట..!

స్టార్ యాంకర్ ప్రదీప్… హీరోగా మారుతూ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. మున్నా అనే యువ దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. నిజానికి మార్చి 25నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ రావడంతో వాయిదా పడింది. ‘గీత ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ముందుకు రావడంతో.. అందరి ఫోకస్ ఈ చిత్రం పై పడింది.

అందులోనూ అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ‘నీలి నీలి ఆకాశం’ అనే పాట యూట్యూబ్లో 191 మిలియన్ల పైనే వ్యూస్ ను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించడంతో ఈ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రం పై క్రేజ్ మరింతగా పెరిగింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ రిజెక్ట్ చేసాడట. దర్శకుడు మున్నా ఈ చిత్రం కథను మొదట సత్యదేవ్ కు చెప్పాడట. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సట. సత్యదేవ్ కు కూడా కథ నచ్చి.. ‘కచ్చితంగా చేస్తాను’ అని చెప్పాడట.

కానీ ఆ టైములో సత్య వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో.. దర్శకుడు మున్నా.. ప్రదీప్ తో ట్రయిల్ షూట్ చేసాడట. దాంతో సత్యదేవ్ ను కలిసి.. ‘నీకు కుదరడం లేదు కదా ప్రదీప్ బాగా చేస్తున్నాడు. తనతో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చెయ్యాలనుకుంటున్నట్టు’ చెప్పాడట. ఫైనల్ గా సినిమా కంప్లీట్ అయ్యాక.. అవుట్ పుట్ బాగా వచ్చిందని కూడా సత్యదేవ్ తో చెప్పాడట. ఇటీవల సత్యదేవ్ పాల్గొన్న ఓ టీవీ షోలో సత్యదేవ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus