“నీలి నీలి ఆకాశం” పాటంత బాగుంది అంటున్నారు సినిమా.. ఇది “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” చిత్రంలోని అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో లోని ఓ ఆణిముత్యం అని చెప్పవచ్చు. ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా యస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి ప్రదీప్ (మున్నా)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అభిరుచిగల నిర్మాత యస్వీ బాబు నిర్మించిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”. జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని దిగ్విజయంగా విజయభేరీ మోగిస్తోంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రంలో హీరో ప్రదీప్ మాచిరాజు, దర్శకుడు ఫణి ప్రదీప్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కెమెరామెన్ శివేంద్ర, నిర్మాత తనయులు వినయ్, సంజయ్, చిత్ర నిర్మాత యస్వీ బాబు, జిఎటు, యూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధి బాబీ, పాటల రచయితలు చంద్రబోస్, కో-డైరెక్టర్ కుమార్, పీఆర్ఓ వంశీ-శేఖర్ తదితరులు పాల్గొన్నారు.. అనంతరం చిత్ర నిర్మాత యస్వీ బాబు గార్లిక్ పూలదండ, శాలువాలతో ఘనంగా సత్కరించారు..
జిఏ-2, యువీ డిస్ట్రిబ్యూషన్స్ ప్రతినిధి బాబు మాట్లాడుతూ.. ‘ “30 రోజుల్లో ప్రేమించడంఎలా” చిత్రాన్ని దాదాపు 550 స్క్రీన్స్ లలో రిలీజ్ చేశాం. పెద్ద హీరో సినిమాకి వచ్చినంత ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న ఒక్కరోజులోనే 4 కోట్ల గ్రాస్ వచ్చింది. రెండోరోజు కూడా 90% శాతం కలెక్షన్స్ ఉన్నాయి. ఒక చిన్న సినిమాకి ఇంతలా వసూలు రావడం మాములు విషయం కాదు. థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంకా ఏరేంజ్ కి వెళ్తుందో తెలియదు. ఇంత మంచి సినిమాని మా సంస్థ ద్వారా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన యస్వీ బాబు గారికి మా థాంక్స్.. అలాగే టీమ్ అందరికీ నా అభినందనలు.. అన్నారు.
వినయ్ మాట్లాడుతూ.. ” మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆంధ్ర, తెలంగాణ ప్రేక్షకులకు, అభిమానులకు చాలా చాలా థాంక్స్. ఒక చిన్న సినిమా 4 క్రోస్ గ్రాస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రదీప్ ఫస్ట్ సినిమా మా బ్యానర్ లో నిర్మించడం అదృష్టంగా బావిస్తున్నాం.. అన్నారు.
సంజయ్ మాట్లాడుతూ.. ‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకి కష్టపడి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగుంది సినిమా అంటున్నారు.. మా చిత్రాన్ని ప్రజలదాక తీసుకెళ్లిన మీడియా సోదరులందరికి థాంక్స్.. అన్నారు.
ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ నిర్మాత బాబు గారి పెదాలమీద చిరునవ్వు చూస్తుంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అర్థం అవుతుంది. నీలి నీలి పాట అంత బాగుంది సినిమా.. పాట అంత హిట్ అని పోస్టర్స్ లో వేస్తుంటే చాలా ఆనందంగా గర్వాంగా ఉంది. అలాంటి అద్భుతమైన స్విచ్ వేషన్స్ ని, గొప్ప బాణీలను సమకూర్చిన మున్నా, అనూప్ లకు నా థాంక్స్.. అన్నారు.
అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘ నీలి నీలి పాటతో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తే.. నేను రాసిన అమ్మ పాట సెకండ్ ఆఫ్ లో ఆడియెన్స్ ని కూర్చోపెట్టింది. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా నిర్మాత, దర్శకులకే చెందుతుంది. అలాగే మున్నా కథ, కథనాలకి ప్రదీప్, అమృత అయ్యర్ ఇద్దరూ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు.. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనూప్ కి థాంక్స్.. అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ‘ నీలి నీలి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అంతకన్నా బాగా సినిమాని హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ ధన్యవాదాలు. థియేటర్ లో రెస్పాన్స్ చూసి సప్రయిజ్ అయ్యాం. అన్ని ఏరియాలనుండి రెస్పాన్స్ వస్తుంది. అమ్మ పాట చాలబాగుంది అని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంకా పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాం.. అన్నారు.
చిత్ర నిర్మాత యస్వీ బాబు మాట్లాడుతూ.. ‘ కథ మీద నమ్మకంతో మంచి హిట్ సినిమా తీస్తున్నాం అనుకున్నాం. ఫస్ట్ కాపీ చూశాక సినెమపై ఇంకా కాన్ఫిడెంట్స్ పెరిగింది. అందుకే ఓటీటీ ఆఫర్స్ వచ్చినా ఇవ్వకుండా.. ధియేటర్సలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాలని ఇన్నిరోజులు వెయిట్ చేసి రిలీజ్ చేశాం. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఇవాళ నా నమ్మకం నిజం అయింది. మున్నా చిన్నగా కనిపించినా విషయం ఎక్కువ ఉంది. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. క్వాలిటీ విషయంలో తను అనుకున్నది వచ్చేదాకా కాంప్రమైజ్ కాడు. మా బ్యానర్ కి ఒక పెద్ద హిట్ ఇచ్చినందుకు మున్నా కి థాంక్స్. ప్రజలందరి హృదయాల్లో ప్రదీప్ మంచి స్థానం సంపాదించుకున్నాడు. అలాంటి ప్రదీప్ ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించారు.. అన్నారు.
దర్శకుడు ఫణి ప్రదీప్ (మున్నా) మాట్లాడుతూ.. ‘ నీలి నీలి ఆకాశం పాటకోసం జనాలు థియేటర్ కి వస్తున్నారు. వచ్చాక నవ్వుకుని.. అమ్మ పాట వచ్చాక ఏడుస్తున్నారు. అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. 4.17 క్రోర్స్ ఒక్క రోజుల్లోనే కలెక్ట్ చేయడం .. ఈ సినిమా రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లా నా వెంట ఉండి చాలా సపోర్ట్ చేసిన ప్రదీప్ కి నా థాంక్స్.. నాకలని నిజం చేశాడు. శివేంద్ర ఫోటోగ్రఫీ విజువల్స్ సినిమాకి హెల్ప్ అయ్యాయి. అనూప్ నా ఏంజెల్. సినిమాకి ఇంత ఓపెనింగ్స్ వచ్చాయి అంటే అనూప్ మ్యూజిక్ కారణం.. మా నిర్మాత బాబు గారు లేకపోతే ఈ సినిమా లేదు. నాకు చాలా సపోర్ట్ చేశారు. కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కి కొత్తగా సినిమాలు తీయబోయే డైరెక్టర్స్ కి మా చిత్రాన్ని అంకితమిస్తున్నాం.. అన్నారు.
హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. ‘ ఎంతో మంది హీరోల సినిమాలు చూసిన నేను అదే థియేటర్ లో నా సినిమా మొదటి షో చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్ లో ఇదొక ఎమోషనల్ మెమొరబుల్ మూమెంట్. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువమంది థియేటర్స్ కి వచ్చి చూస్తున్నారు. ఏపీ, తెలంగాణ, యుయస్ అన్నీ ఏరియాలనుండి ప్రేక్షకుల రెస్పాన్స్ వస్తూంది. నిర్మాత బాబు గారు సొంత కొడుకు ఫిల్మ్ లాంచ్ అయితే ఎంత కేర్ తీసుకుంటారో అంతే కేర్ నాపై తీసుకొని ఈ చిత్రాన్ని బిగ్ లాంచింగ్ ఫిల్మ్ లా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇంకా చాలా పెద్ద హిట్ అయి ఆయన మరిన్ని డబ్బులు లెక్కించాలి. సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన మున్నా, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ కి నా స్పెషల్ థాంక్స్.. అన్నారు
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!