ఆ నాటి సంగతులు పంచుకున్న పృథ్వీరాజ్‌

‘చెంప దెబ్బకు రియాక్షన్‌ నాగార్జునగారికి బాగా నచ్చిందట’… ఈ డైలాగ్‌ వినగానే ‘దూకుడు’లో బ్రహ్మానందం ట్రాక్‌ గుర్తొస్తుంది. అంతగా క్లిక్‌ అయిన ట్రాక్‌ అది. మహేష్‌బాబు టీమ్‌ చెప్పిన చెంపదెబ్బల అబద్దం విని తెగ దెబ్బలు కాస్తాడు బ్రహ్మానందం. ఇది సినిమా వరకే… రియల్‌ లైఫ్‌లో కూడా జరిగిందట. అయితే అది 30 ఇయర్స్‌ పృథ్వీ జీవితంలో. ఓ సినిమాలో సీన్‌ రియలిస్టిక్‌గా రావాలని అలా చేశారట. ఆ సినిమా ‘చంద్రలేఖ’ కాగా ఆ దర్శకుడు కృష్ణవంశీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతోపాటు పృథ్వీకి ‘మంచు’ దెబ్బ రుచి కూడా తెలుసట.

ఓ సినిమా షూటింగ్‌కోసం రాజోలు వెళ్లారు పృథ్వీ. ఊరి జనమంతా అక్కడికి వచ్చారు. ‘మీ కామెడీ అద్భుతం’ అంటూ ఆయన చుట్టూ చేరి పొగిడేశారు. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్‌ ఆర్‌ఎంపీ డాక్టరు. సీన్‌లోకి వెళ్లగానే ఓ డైలాగులో ‘నువ్వు రత్తాలు కోడలివట కదా, ఇదిగో నీ అందానికి నా రేటు ₹100’ అంటూ ఆ పాత్ర చేస్తున్న మంచు లక్ష్మిని తక్కువ చేసి మాట్లాడే సీన్‌ అది. ఆయన డైలాగ్‌ పూర్తవుతుండగానే మంచు లక్ష్మి లాగిపెట్టి చెంపమీద ఒక్కటిచ్చిందట. దాంతో ఆయన దిమ్మ తిరిగిపోయిందట. మోహన్‌బాబు ఫ్యామిలీలో ఎవరు కొట్టినా అంత ధాటిగా ఉండదు. కానీ, మంచు లక్ష్మి కొట్టిన దెబ్బను తట్టుకోలేకపోయా అని చెప్పుకొచ్చారు పృథ్వీ.

ఇక నాగార్జున చెంప దెబ్బ విషయానికొస్తే… ‘చంద్రలేఖ’ సినిమా షూటింగ్‌లో జరిగిందది. ఆ సినిమాలో ఓ సీన్‌ కోసం పృథ్వీరాజ్‌ను డైరెక్టర్‌ కృష్ణవంశీ… నాగార్జున వెనకాలే వెళ్లి భుజం మీద చెయ్యి వెయ్యాలని చెప్పారట. ఆయన అలా వెళ్లి చెయ్యి వేసే లోపు నాగార్జున తప్పుకున్నారట. దీంతో పక్కనే ఉన్న ఒక మహిళపై పృథ్వీ చెయ్యి పడింది. ఆ వెంటనే ఆమె పృథ్వీ చెంప చెల్లుమనిపించింది. ఆ విషయం పృథ్వీకి అర్థమయ్యేలోపు కృష్ణవంశీ ఫ్రేమ్‌ పెట్టి ‘రిలాక్స్ అవ్వొద్దు’ అంటూ సీన్‌ తీసేశారట. సహజంగా ఉండాలని ముందుగా సీన్‌ గురించి పృథ్వీకి చెప్పకుండా అలా చేశారట!

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus