Guntur Kaaram: గుంటూరు కారం మూవీ విషయంలో కుట్ర చేసింది ఆ నలుగురు వ్యక్తులేనా?

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ ఇప్పటివరకు 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా మరికొన్ని ఏరియాలలో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. అయితే గుంటూరు కారం మూవీ రిలీజ్ సమయంలో ఈ సినిమాకు బుక్ మై షోలో తక్కువ రేటింగ్స్ ఇవ్వడంతో పాటు కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేశారు.

అయితే గుంటూరు కారం విషయంలో నెగిటివిటీ హద్దులు దాటడంతో ఈ సినిమా యూనిట్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి నెగిటివ్ గా ప్రకారం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందుతోంది. అరెస్ట్ అయిన వ్యక్తుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.వీళ్లు గుంటూరు కారం నుంచి నెగిటివ్ ప్రచారం చేయడం వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ఈ నలుగురిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. మరోవైపు (Guntur Kaaram) గుంటూరు కారం మూవీ ఓటీటీలో ఎప్పుడు విడుదలైనా అదనపు సన్నివేశాలతో ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్ కామెంట్లను ఈ సినిమా మేకర్స్ గుర్తు పెట్టుకుంటారేమో చూడాల్సి ఉంది. గుంటూరు కారం ఓటీటీలో ఏ రేంజ్ లో రికార్డులు సాధిస్తుందో చూడాలి.

మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ తో త్వరలో బిజీ కానుండగా 2026 సంవత్సరం చివర్లో లేదా 2027 సంవత్సరం మొదట్లో మహేష్ రాజమౌళి మూవీ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో గూస్ బంప్స్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus