పక్కా స్క్రిప్ట్ లేకుండా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తే ఎంత బడ్జెట్ వేస్ట్ అవుతుంది అనేది ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అయితే కొంతమంది స్టార్ డైరెక్టర్లు మాత్రం వాటిని ఇంప్రొవైజ్ చేసుకునే క్రమంలో ఎక్కువ సీన్స్ ను చిత్రీకరిస్తూ ఉంటారు. అందుకే ఫుటేజ్ ఎక్కువైపోవడం.. దాని వల్ల బడ్జెట్ కూడా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి.. ఈ విషయాన్ని ఎక్కువగా చెబుతూ ఉంటారు.
బడ్జెట్ పరిమితులు దాటకుండా పేపర్ పైనే ఎక్కువ వర్క్ చేయాలని చిరు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టైంలో ఎక్కువగా చెప్పారు. అయినప్పటికీ పెద్ద దర్శకులే బోలెడన్ని సీన్లు చిత్రీకరించి చివరికి డస్ట్ బిన్ లో పడేస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ‘గుంటూరు కారం’ విషయంలో త్రివిక్రమ్ కూడా ఇలాంటి పొరపాటే చేశారు. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ ని ఇంప్రొవైజ్ చేసే క్రమంలో బోలెడన్ని సీన్లు చిత్రీకరించారు. కానీ ఫైనల్ గా ఆ సీన్స్ ను డస్ట్ బిన్లో పడేశారు.
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) విషయంలో ఇలా త్రివిక్రమ్ వేస్ట్ చేయించిన బడ్జెట్ అక్షరాలా రూ.40 కోట్లు అని ఇన్సైడ్ టాక్. అక్కరలేని ఫైట్స్ ని చిత్రీకరించి వాటిని డిలీట్ చేయడం, ఫైనల్ గా అందులో కొన్ని క్లిప్స్ ను వాడుకోవడం వంటివి త్రివిక్రమ్ చేశారట. ‘గుంటూరు కారం’ విషయంలోనే కాదు ఆయన అల్లు అర్జున్ తో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా విషయంలో కూడా రూ.30 కోట్ల పైనే బడ్జెట్ ను వేస్ట్ చేసినట్టు ఇన్సైడ్ టాక్.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!