కియారా- సిద్దార్థ్ లతో పాటు.. పెళ్లి కోసం కోట్లు కుమ్మరించిన స్టార్ కపుల్స్ వీళ్ళే..!

పెళ్ళంటే జీవితంలో ఒక్కసారి చేసుకునే అద్భుతమైన పండుగ. దాని కోసం ఎంత ఖర్చైనా చేయడానికి సామాన్యులు తమ సంపాదనలో చాలా వరకు దాని కోసం ప్రత్యేకంగా దాచుకుంటూ ఉంటారు. మరి సెలబ్రిటీలు ఈ విషయంలో తగ్గుతారా..!వాళ్ళు ఎక్కువ మందిని పెళ్ళికి ఆహ్వానించపోయినా.. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరుపుకోవాలని కోట్లు కుమ్మరిస్తూ ఉంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో కోట్లు కుమ్మరించుకునే స్టార్ లను మనం చూస్తూనే ఉన్నాం.

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా- సిద్దార్థ్ లు పెళ్లి చేసుకున్నారు. వీరు తమ పెళ్లి కోసం రూ.5 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు వినికిడి. వీరిలాగే ఇంకొంతమంది బాలీవుడ్ స్టార్లు కోట్లు కుమ్మరించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) దీపికా పదుకొనే – రణ్ వీర్ సింగ్ :

స్టార్ హీరోయిన్ దీపికా.. స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ లు 2018 లో పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని లేక్ కోమోలో వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ జంట తమ పెళ్లి కోసం ఏకంగా రూ.77 కోట్లు ఖర్చు చేశారట.

2) అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(క్రికెటర్)ని 2017లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట తమ పెళ్ళి కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేశారు.

3) అలియా భట్ – రణ్ బీర్ కపూర్ :

బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా పిలవబడే ఈ జంట.. గతేడాది పెళ్లి చేసుకున్నారు. వీరు తమ పెళ్లి కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశారు.

4) విక్కీ కౌశల్ – కత్రీనా కైఫ్ :

2021 లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపుర్ లోని ఫోర్ట్ బర్వారాలో పెళ్లి చేసుకున్న ఈ జంట… తమ పెళ్లి కోసం రూ.4 కోట్లు ఖర్చు చేశారు.

5) కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా :

ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో సూర్యఘర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వీరి పెళ్ళికి రూ.6 కోట్లు ఖర్చు అయ్యింది. అలాగే ఫిబ్రవరి 12న ముంబైలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. మరి దానికి ఎంత ఖర్చవుతుంది అనేది చూడాలి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus