Kalki 2898 AD: ‘కల్కి..’ మిస్ అవ్వకుండా చూడడానికి గల 5 కారణాలు..!

  • June 24, 2024 / 09:18 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  , నాగ్ అశ్విన్ (Nag Ashwin) ..ల కలయికలో ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD)రూపొందింది. అశ్వినీదత్ (C. Aswani Dutt) తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆన్లైన్ లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. అంతలా ‘కల్కి 2898 ad ‘ పై జనాల్లో ఆసక్తి పెరగడానికి కారణాలు ఏంటి? అనే ప్రశ్న ‘కల్కి..’ ని పట్టించుకోని వారిని వెంటాడుతూ ఉండవచ్చు. పురాణాలతో ముడిపెడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. అంతేకాదు ‘కల్కి..’ పై ఆసక్తి పెరగడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి :

భైరవ ది సూపర్ హీరో

మామూలుగానే ప్రభాస్ ఓ మాస్ కటౌట్. యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేస్తాడు. అందుకే ‘బాహుబలి’ (Baahubali) తర్వాత హాలీవుడ్ రేంజ్ హీరోలతో ప్రభాస్ ని పోలుస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు. అలాంటి కటౌట్ ని ఈసారి భైరవ అనే ఓ సూపర్ హీరో పాత్రలో ప్రజెంట్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘కల్కి 2898 ad ‘ పై ఆసక్తి పెరగడానికి మొదటి కారణం ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ :

ఇన్నాళ్లు మనం హాలీవుడ్ సినిమాల్లోని విజువల్స్ చూసి మురిసిపోయాం. ‘తెలుగులో ఇలాంటి సినిమా వస్తే బాగుణ్ణు’ అనే ఊహల్లోనే విహరించాం. ‘బాహుబలి’ ‘ఆర్.ఆర్.ఆర్’ లోని విజువల్స్ చూసి.. తెలుగు సినిమాకి అదే గొప్ప అచీవ్మెంట్ అని సరిపెట్టుకున్నాం. ఇదంతా ‘కల్కి 2898 ad ‘ గ్లింప్స్ రానంత వరకు మాత్రమే. కానీ ఒక్కసారి ‘కల్కి 2898 ad ‘ గ్లింప్స్ వచ్చాక అందరి అభిప్రాయాలూ మారిపోయాయనే చెప్పాలి. ఇక ట్రైలర్స్ చూశాక అవి మరింత బలపడ్డాయి. అతని విజన్ అంత గొప్పది అనేది అందులోని విజువల్స్ తో అందరికీ తెలిసొచ్చింది. టాలీవుడ్ కి నాగ్ అశ్విన్ వంటి దర్శకులు అవసరం అనే ఆలోచనలు కూడా పుట్టేలా చేశాయి ‘కల్కి..’ ప్రోమోస్.

‘శంభల’ రహస్యం ఏంటి? కాంప్లెక్స్ కథ ఏంటి?

‘బాహుబలి’ చూశాక ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ‘కల్కి..’ ట్రైలర్స్ చూశాక.. ‘శంభల’ ఏంటి.. దాని రహస్యం ఏంటి? కాంప్లెక్స్ ఏంటి… దాని కథ ఏంటి? వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది.

‘కల్కి..’ ఎవరు?

ఇది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభాస్ ‘భైరవ’ అయితే..? దీపికా పదుకోనె (Deepika Padukone) ఎవరు? ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు? అతనే కల్కీనా? ఈ అంశం కూడా సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది.

చాలా సర్ప్రైజులు

అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ (Amitabh Bachchan) చేస్తున్నాడు..! కమల్ (Kamal Haasan)  గెటప్ కూడా భయపెట్టేలా ఉంది. అసలు అతని పాత్ర ఏంటి? విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , దుల్కర్ (Dulquer Salmaan) , దిశా పటానీ (Disha Patani) .. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా పాత్రలు సర్ప్రైజ్ చేస్తాయట. ఇవన్నీ మహాభారతంలోని పాత్రల్ని పోలి ఉంటాయనే టాక్ కూడా సినిమాపై హైప్ ఏర్పడేలా చేసింది.

పైన చెప్పుకున్న కారణాలు ఒకెత్తు అయితే.. తెలుగులో ఓ పెద్ద సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో ఓ పెద్ద సినిమా చూడాలని ఆశతో ఉన్నారు. వారందరికీ కూడా ‘కల్కి 2898 ad ‘ బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus