మరో 3 రోజుల్లో అంటే జూలై 12న ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) ప్రేక్షకుల ముందుకు రానుంది. 1996 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భారతీయుడు’ కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ‘కల్కి 2898 ad’ హడావిడి తగ్గింది కాబట్టి అందరి చూపు ‘భారతీయుడు 2’ పైనే ఉంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వెళ్లే ఛాన్స్ ఉంది. ‘భారతీయుడు 2’ ని ప్రేక్షకులు మిస్ కాకుండా చూడటానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
సేనాపతి రీ ఎంట్రీ :
‘భారతీయుడు’ లో సేనాపతిగా కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వృద్ధుడి పాత్రకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండు వేళ్ళతో ప్రత్యర్థులను కట్టడి చేయడం. లంచగొండి తన కొడుకైనా సరే కనికరం చూపించడు. మరి ‘భారతీయుడు 2’ లో అతని ఎంట్రీ ఎలా ఉండబోతోంది? అనేది ఆసక్తిని రేకెత్తించే అంశం.
శంకర్ మార్క్ గ్రాండ్ విజువల్స్
‘గ్రాండియర్’ అనే పదానికి సినానిమ్ గా శంకర్ (Shankar) పేరు చెప్పుకుంటారంతా. ఆయన సినిమా చూస్తుంటే.. ఓ కొత్త ప్రపంచానికి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అదే టైంలో సి సెంటర్ ఆడియన్స్ ని కూడా కదలకుండా కూర్చోబెట్టే యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్ ఉంటాయి ఆయన సినిమాల్లో..! భారతీయుడు 2 లో ఆ రేంజ్లో ఆకట్టుకునే అంశాలు ఉంటాయనేది జనాల నమ్మకం.
ఏ అంశం పై పోరాటం :
‘భారతీయుడు’ లో ప్రభుత్వ ఉద్యోగులు , డాక్టర్లు… లంచగొండులుగా మారడం.. దానిపై భారతీయుడు చేసిన పోరాటాన్ని చూపించారు దర్శకులు శంకర్. మరి ‘భారతీయుడు 2’ ఎలాంటి ఇష్యూ పై సేనాపతి ఫైట్ చేస్తారు అనేది కూడా జనాలని థియేటర్లకు తీసుకొచ్చే అంశం.
అనిరుథ్ సంగీతం :
‘విక్రమ్’ కి (Vikram) అనిరుథ్ (Anirudh Ravichander) సమకూర్చిన సంగీతం మరువలేనిది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అందరికీ గూజ్ బంప్స్ తెప్పించాడు. మరి ‘భారతీయుడు 2’ లో అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అనేది అందరి కోరిక. రెహమాన్ లేని లోటుని అనిరుథ్ తీరుస్తాడనే నమ్మకం కూడా అందరిలో ఉంది.
ఆ స్టార్స్ ప్రాముఖ్యత ఏంటి?
‘భారతీయుడు 2’ లో కమల్ హాసన్ తో పాటు చాలా మంది స్టార్స్ ఉన్నారు. సిద్ధార్థ్ (Siddharth) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ,కాజల్, బాబీ సింహా(Bobby Simha), ఎస్.జె.సూర్య(S. J. Suryah).. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. ‘ఈ పాత్రలకి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. ‘భారతీయుడు 3′ కి లీడ్ ఇచ్చే పాత్రలు ఏమవుతాయి?’ అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.