బాలాదిత్య ఎలిమినేషన్ వెనక ఉన్న అసలు 5 కారణాలు ఇవే..!

  • November 13, 2022 / 02:34 PM IST

బిగ్ బాస్ హౌస్ నుంచీ 10వ వారం అనూహ్యంగా బాలాదిత్య ఎలిమినేట్ అయిపోయాడు. అన్ అఫీషియల్ ఓటింగ్స్ లో కూడా బాలాదిత్య వెనకబడి ఉన్నాడు. గత రెండురోజుల నుంచీ కూడా బాలాదిత్యకి హ్యూజ్ గా ఓటింగ్ అనేది జరగలేదు. ఇక శనివారమే హోస్ట్ నాగార్జున బాలాదిత్యని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేశాడు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బాలాదిత్య టాప్ – 5లో ఉంటాడని చాలామంది ఖచ్చితంగా అనుకున్నారు. కానీ, టాప్ 5లో వెళ్లలేకపోయాడు. అసలు బాలదిత్య ఎలిమినేషన్ కి మనం కొన్ని కారణాలు చూసినట్లయితే.,

నెంబర్ – 1

బాలాదిత్య గేమ్ ఫస్ట్ నుంచీ కూడా సాఫ్ట్ గానే సాగింది. ముఖ్యంగా గీతుని చెల్లి అనుకుంటూ గీతుతోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేశాడు. మిగతా హౌస్ మేట్స్ తో మాట్లాడుతున్నా కూడా సరైన బాండింగ్ అనేది జరగలేదు. గీతుతో జరిగిన సిగెరట్ ఇష్యూ, అలాగే స్పాన్సర్ టాస్క్ లో జరిగిన ఆర్గ్యూమెంట్స్, చేపల టాస్క్ లో లొల్లి ఇలా చాలాసార్లు గీతుకి క్లాస్ పీకాడు. గీతు గేమ్ బ్యాడ్ అవుతున్నప్పుడు బాలాదిత్య హైలెట్ అవుతూ వచ్చాడు. కానీ, తన ఒరిజినల్ గే్మ ని ఎక్కడా చూపించలేకపోయాడు. ముఖ్యంగా హౌస్ లో స్ట్రాటజీలు , తన ఆటలో ఎత్తుగడలని చూపించలేకపోయాడు.

నెంబర్ – 2

ఆటలో మంచితనం మోతాదు ఎక్కువైంది. నిజానికి మంచితనం అనేది మైనస్ కాదు, కానీ బాలదిత్య విషయంలో అది కొద్దిగా మైనస్ అయిపోయింది. ఆటలో కూడా మంచితనం చూపిస్తే గేమ్ ఎలా గెలుస్తారు అనేది ప్రేక్షకులు ప్రశ్నించారు. అంతేకాదు, ఫస్ట్ వీక్ లోనే తన మంచితనం వల్ల క్లాస్ లో ఉన్న వ్యక్తి ట్రాష్ లోకి వచ్చాడు. ఆ తర్వాత చాలా టాస్క్ లలో వేరే వారి కోసం శాక్రిఫైజ్ చేశాడు. ఇది కూడా బాలాదిత్య గేమ్ ని దెబ్బకొట్టింది.

నెంబర్ – 3

నామినేషన్స్ లో పాయింట్స్ సరిగ్గా పెట్టలేకపోయాడు. తన టాస్క్ లో , తన ఆటలో ఎవరు అడ్డువస్తే వాళ్లని నామినేట్ చేయాలి కానీ, ఏదో ఒక పాయింట్ లో వేరేవాళ్లని నామినేట్ చేయడం అనేది దెబ్బకొట్టింది. అంతేకాదు, తిప్పి తిప్పి అదే చెప్పడం, పాయింట్ కాకుండా పుట్టుపూర్వోత్తరాలు కూడా మాట్లాడటం వల్ల అసలు పాయింట్ గాలికి పోయింది. లాజికల్ గా థింక్ చేస్తూ బాలాదిత్య చెప్పిన కొన్ని పాయింట్స్ అయితే ప్రేక్షకులకి అర్దమే కాలేదు. దీంతో ప్రీచ్ లు, స్పీచ్ లు ఎక్కువగా ఇస్తున్నాడనే ముద్ర పడిపోయింది.

నెంబర్ – 4

చాలావిషయాలు ల్యాగ్ చేసి మాట్లాడటం, కట్టె – కొట్టే – తెచ్చే అనే పద్దతిలో మాట్లాడకపోవడం కూడా బాలాదిత్య గేమ్ ని దెబ్బకొట్టింది. ఒక విషయం చెప్పేటపుడు వేరే పాయింట్స్ ని కూడా మాట్లాడటం , అలాగే ల్యాగ్ చేసి మాట్లాడటం అనేది ఆడియన్స్ సహనాన్ని పరీక్షించింది. ఇక హౌస్ లో టాస్క్ లు ఆడేటపుడు కూడా దూసుకుపోయే మనస్తత్వం లేకపోవడం కూడా బాలాదిత్యకి మైనస్. తన టీమ్ మెంబర్స్ టాస్క్ ని ఎలా ఆడుతున్నారో చూసి తను గేమ్ స్టార్ట్ చేసేటపుట్టకి వారాలు గడిచిపోయాయి.

నెంబర్ 5

సోషల్ మీడియాలో బాలాదిత్యకి ఫేమ్ లేకపోవడం కూడా మైనస్. దీనివల్ల తనకి ఓట్ బ్యాకింగ్ అనేది లేకుండా పోయింది. నిజానికి నామినేషన్స్ లోకి వచ్చినపుడు బాలాదిత్య డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఒకేఒకసారి మాత్రం గీతుతో సిగెరట్ ఇష్యూ అయినపుడు హ్యూజ్ గా ఓటింగ్ అనేది జరిగింది. కానీ, దానిని బాలాదిత్య నిలబెట్టుకోలేకపోయాడు. ఏది ఏమైనా టాప్ – 5లో ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్న బాలాదిత్య 10 వారమే ఎలిమినేట్ అయ్యాడు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus