Rathika Eliminated: బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది ? పెద్దయ్యా అంటూ తన గెయ్యి తానే తవ్వకుందా?

బిగ్ బాస్ హౌస్ లో మంచి స్ట్రాటజీలు వర్కౌట్ చేసే బ్రైయిన్ ఉన్నా, గేమ్ ని బాగా అర్ధం చేసుకునే తెలివితేటలు ఉన్నా కూడా రతిక 4వ వారమే బ్యాగ్స్ సర్దేసుకుంది. రతిక ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ కి పెద్ద షాకింగ్ గా మిగిలిపోయింది. అసలు బిగ్ బాస్ హౌస్ లో నిజంగా గేమ్ ఆడిందా ? లేదా పల్లవి ప్రశాంత్ వల్లే రతిక ఎలిమినేట్ అయ్యిందా అనేది ఒక్కసారి చూసినట్లయితే.,

నెంబర్ – 1

ఫస్ట్ వీక్ నుంచీ రతిక గేమ్ రాంగ్ ట్రాక్ లోనే నడించింది. లేడీ లక్ అని ఎప్పుడైతే ప్రశాంత్ బ్యాండ్ కట్టాడో అప్పట్నుంచీ అతడ్ని కవ్వించింది.. ఆటపట్టిద్దాం అనుకుంది.. తన ఆటని మర్చిపోయింది. లవ్ ట్రాక్ వేద్దాం అనుకుని మైయిన్ ట్రాక్ వదిలేసింది. దీంతో బండి బోల్తా కొట్టేసింది. అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కెమెరా ఫోకస్ తనపైన ఉండేందుకు కంటెంట్ ఇవ్వడానికి చాలా కృషి చేసింది. ఒకానొక దశలో ఇది బాగా వర్కౌట్ అయ్యింది. అయితే, తర్వాత ఆడియన్స్ కేవలం కంటెంట్ కోసం చేస్తోందని పట్టేశారు. ఇంటికి పంపేశారు.

పల్లవి ప్రశాంత్ ని తన చుట్టూ తిప్పుకుని ప్రేమిస్తే లో భరత్ ని చేద్దాం అనుకుంది. కానీ, వర్కౌట్ అవ్వలేదు. పల్లవి ప్రశాంత్ త్వరగా మేలుకుని అక్కా అనేశాడు.

నెంబర్ – 2

సెకండ్ వీక్ తన గేమ్ పూర్తిగా గాడి తప్పింది. అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తుంటే రతిక మద్యలో దూరి అసలు నువ్వు రైతుబిడ్డవి కాకపోతే ఎవరు ? అంటూ రెచ్చగొట్టింది. లవ్ చేస్తున్నావా.. ఏం చేస్తున్నావ్.. కెమెరా కోసం చేస్తున్నావా ? అదేనా నీ ఆట అంటూ పల్లవి ప్రశాంత్ ఆటని ప్రశ్నించి తన ఆటని అటకెక్కించేసింది. పెద్దయ్యా పెద్దయా అంటూ తన గొయ్యి తానే తవ్వుకుంది. అలాగే ఆ వారం పల్లవి ప్రశాంత్ ని హౌస్ లో చాలామంది యాక్టింగ్ చేస్తున్నావనే టార్గెట్ చేసి నామినేట్ చేశారు. .అదే వారం ప్రిన్స్ యావర్ ఇష్యూలో తలదూర్చింది. షకీల కంటే ప్రిన్స్ డిసర్వ్ అంటూ గోల గోల చేసింది. మాయాస్త్రం పంచడంలో గేమ్ ఛేంజర్ అవ్వాలనుకుని మొండి పట్టుపట్టింది. దీంతో తన టీమ్ మేట్స్ అందర్నీ బఫూన్స్ అంటూ కామెంట్స్ చేసి అందరికీ శత్రువు అయిపోయింది. అంతేకాదు, దీనివల్ల మిగతా హౌస్ మేట్స్ కి కూడా రతిక మాట్లాడిన మాటలు నచ్చలేదు. దీంతో హౌస్ మేట్స్ సహకారం లేకుండా పోయింది.

నెంబర్ – 3

మూడోవారం చాలా షేడ్స్ చూపించింది రతిక. ఇది చూసి ఆడియన్స్ అందరూ బాబోయ్.. రతిక షేడ్స్ అంటూ కామెండ్స్ చేశారు. ప్రిన్స్ కి సపోర్ట్ చేస్తూ తనతో పులిహోర కలపడం స్టార్ట్ చేసింది. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ – రతిక బాల్కనీలో పెట్టిన ముచ్చట్లు రతిక షేడ్స్ ని ఆడియన్స్ కి చూపించాయ్. మూడోవారం తను చేసిన నామినేషన్స్ తనకే అర్ధం కాలేదు. శుభశ్రీని గౌతమ్ ని నామినేట్ చేసింది. అమర్ ని బ్లైండ్ గా ఫాలో అయిపోయి చేసేశా అని తర్వాత తానే స్వయంగా వీకెండ్ ఎపిసోడ్ లో ఒప్పుకుంది. కూడా చేప్పేసింది.

నెంబర్ – 4

ఎప్పుడైతే తన ఎక్స్ లవర్ అంటూ పర్సనల్ లవ్ మేటర్ అంటూ హౌస్ లోకి టాపిక్ తెచ్చిందో అక్కడ్నుంచీ తన పతనం స్టార్ట్ అయిపోయింది. పల్లవి ప్రశాంత్ తో ఎందుకు క్లోజ్ అయ్యింది. ఎందుకు మళ్లీ అతడ్నీ ఛీదరించుకుంది.., తర్వాత ఎక్స్ ని ఎందుకు గుర్తు చేసింది అనేది ప్రేక్షకులు కనిపెట్టేశారు. దీంతో తను ఫస్ట్ వీక్ లో సంపాదించుకున్న కొద్దో గొప్పో పేరు మొత్తం పోయింది. ఇక ప్రిన్స్ టాస్క్ చేసేటపుడు ఐస్ ముక్కలు ప్యాంట్ లో వేసి , గేమ్ కోసం ఇలా చేస్తారా అని ఆడియన్స్ కామెంట్స్ చేసేలా చేసుకుంది. ఐస్ ముక్కులు వేసినపుడే తన గేమ్ చల్లబడిపోయింది. రతిక చేస్తున్న వాదనకి ఇరిటేట్ అయిన ఆడియన్స్ తను ఎప్పుడెప్పుడు నామినేషన్స్ లోకి వస్తుందా అని వైయిట్ చేశారు. అనుకున్నట్లుగానే ఎలిమినేట్ చేశారు.

నెంబర్ – 5

సోషల్ మీడియాలో పెద్దగా క్రేజ్ లేకపోయినా కూడా చాలామంది హౌస్ మేట్స్ వారి గేమ్ తోనే ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రిన్స్ యావార్ ని చెప్పచ్చు. గేమ్ లో గెలవకపోయినా తన పట్టుదల మాత్రం ఆడియన్స్ కి బాగా నచ్చుతోంది. లాంగ్వేజ్ రాకపోయినా, లాజిక్స్ మాత్రం బాగా వర్కౌట్ చేస్తున్నాడు. పబ్లిక్ కి కనెక్ట్ అవుతున్నాడు. అంత తెలివి ఉండి, గేమ్ ఆడగలిగే సత్తా ఉన్నా కూడా కేవలం తన ఆటతీరుతో బయటకి వచ్చేసింది రతిక. అంతేకాదు, లాస్ట్ వీక్ అమర్ అండ్ రతిక ఇద్దరూ కూడా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి మాట్లాడటం, చాలా మాటలు అనడం అనేది ఆడియన్స్ కి నచ్చలేదు. అలాగే రతిక పర్సనల్ గా టార్గెట్ చేస్తూ నానా మాటలు అన్నది. దీంతో ఆడియన్స్ రతికపై ఇంకా గ్రెడ్జ్ పెట్టుకున్నారు. సింపుల్ గా ఎలిమినేట్ చేశారు. సో, మొత్తానికి ఒక హౌస్ మేట్ ని ఆడియన్స్ ఇలా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయడం అనేది కూడా చాలాకాలం తర్వాత బిగ్ బాస్ షోలో జరిగింది.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus