సూర్య కిరణ్ డైరెక్ట్ చేసిన 5 సినిమాల్లో.. ఒక్క హిట్టయినా ఉందా?

‘బిగ్ బాస్4’ లో అడుగుపెట్టిన మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయాడు కంటెస్టెంట్ సూర్య‌కిర‌ణ్. అతను హౌస్లో ఉన్నన్ని రోజులు ఎక్కువగా అందరికీ లెక్చర్లు ఇస్తుండడంతో.. ఇంటి సభ్యులు అతన్ని నామినేట్ చేసి పడేసారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఇతనికి పెద్దగా క్రేజ్ లేకపోవడంతో ఓట్లు పడలేదు. దాంతో ఇతను మొదటివారానికే ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే సూర్య కిరణ్ బయటకు వచ్చేసిన తరువాత.. ఇతను ప్రముఖ దర్శకుడని.. అలాగే స్టార్ హీరోయిన్ కళ్యాణి భర్త అని అంతా తెలుసుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది.

అయితే సూర్య కిరణ్ ఎన్ని చిత్రాలు డైరెక్ట్ చేసాడు. అందులో హిట్లెన్ని.. ప్లాపులెన్ని అనే విషయాలు తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి సూర్య కిరణ్ 5 సినిమాలు డైరెక్ట్ చేసాడు. అవేంటో? వాటి ఫలితాలేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) స‌త్యం :

సుమంత్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రంతో సూర్య కిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి ….సూర్య కిరణ్ ‌కు శుభారంభాన్ని ఇచ్చింది.

2) ధన 51:

సూర్య కిరణ్ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమిది. సుమంత్, సలోని జంటగా నటించిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను అయితే రాబట్టింది కానీ కథాబలం లేకపోవడం వల్ల బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక ప్లాప్ అయ్యింది.

3) బ్రహ్మాస్త్రం :

జగపతి బాబుతో సూర్య కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రం కొత్త కథ, కథనాలతో రూపొందినప్పటికీ కూడా ఫ్లాప్ గానే మిగిలింది.

4) రాజు భాయ్ :

మంచు మనోజ్ , షీలా కౌర్ జంటగా నటించిన ఈ చిత్రం ఫ్లాప్ గా మిగిలి… సూర్య కిరణ్ ను నిరాశపరిచింది.

5) ఛాప్టర్ 6:

సూర్య కిరణ్ 5వ చిత్రంగా వచ్చిన ‘చాప్టర్ 6’ కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ చిత్రంలో సూర్య కిరణ్ భార్య కళ్యాణి లీడ్ రోల్ పోషించింది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus