ఎట్టకేలకు ఫిక్సయిన “అదిరింది” రిలీజ్ డేట్!

సినిమాలో విలన్ బాబుని హీరో ఎప్పుడు చంపుతాడా? అని ఎంతో ఆత్రంగా ఎదురుచూసే జనాలు.. సడన్ గా హీరోని విలన్ చంపేస్తే ఎంత సస్పెన్స్ ఫీలవుతారో తెలియదు కానీ.. సినిమా టికెట్ కొన్న తర్వాత “సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల టికెట్ క్యాన్సిల్” అని తెలిస్తే మాత్రం షాక్ అయ్యి షేక్ అయిపోతారు. అయితే.. ఇప్పటికే “అదిరింది” రిలీజ్ విషయంలో రెండుసార్లు షాక్ అయిన జనాలు ఇకపై అసలు రిలీజావుతుందో లేదో అనే విషయాన్ని పట్టించుకోవడం కూడా మానేశారు. నిర్మాతలకే సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఇంక జనాలు ఏం ఎక్స్ ఫెక్ట్ చేస్తారు.

ఎట్టకేలకు నవంబర్ 3న సినిమాని విడుదల చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ.. వారికి మాత్రమే కాదు జనాలకి కూడా సినిమా థియేటర్ లో పడేవారకు నమ్మకం లేదు. విజయ్ కథానాయకుడిగా రూపొందిన ఈ చిత్రం తమిళనాట ఘన విజయం సొంతం చేసుకోవడంతోపాటు పలు వివాదాలకు కూడా దారితీసింది. సమంత, కాజల్, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఇప్పటికే పైరసీ పుణ్యమా అని చాలామంది తెలుగు ఆడియన్స్ కూడా చూసేసిన ఈ సినిమా తెలుగులో ఏమేరకు ఆడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus