63వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ (సౌత్) విజేతలు వీరే

  • June 20, 2016 / 01:13 PM IST

బాహుబలి మరోసారి అవార్డుల వర్షం కురిపించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచినా ఈ సినిమా అడుగుపెట్టిన చోటల్లా గౌరవం అందుకుంటోంది. గత వారం మాటీవీ వారి మా సినీ అవార్డ్స్ లో 13 కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించిన రాజమౌళి కళా ఖండం తాజాగా ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం కిరీటం కైవశం చేసుకుంది.

జక్కన్నని ఉత్తమ దర్శకుడిగా నిలబెట్టింది. హైదరాబాద్ లోని హెచ్ ఐ సి సి లో 63వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ (సౌత్) వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ ఎం.మోహన్ బాబుని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. గత ఏడాది ఉత్తమంగా నిలిచిన తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ సినిమాలకు అవార్డ్ లు అందజేశారు.

అవార్డ్ గ్రహీతలు వీరే
ఉత్తమ చిత్రం : బాహుబలి
ఉత్తమ దర్శకుడు : ఎస్.ఎస్. రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ నటుడు : మహేష్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి : అనుష్క (రుద్రమదేవి )
ఉత్తమ సహాయ నటుడు : అల్లు అర్జున్ (రుద్రమదేవి )
ఉత్తమ సహాయ నటి : రమ్య కృష్ణ (బాహుబలి)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి (రా ముందడుగు వేద్దాం – కంచె )
ఉత్తమ గాయకుడు : ఎం ఎల్ ఆర్ కార్తికేయన్ ( పోరా శ్రీమంతుడా – శ్రీమంతుడు)
ఉత్తమ గాయని : గీతా మాధురి ( జీవనది – బాహుబలి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సెంథిల్ కుమార్ (బాహుబలి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : శేఖర్ (బ్రూస్ లీ )
ఉత్తమ నటుడు (నూతన పరిచయం) : అఖిల్ అక్కినేని (అఖిల్ )
ఉత్తమ నటి (నూతన పరిచయం) : ప్రగ్య జైస్వాల్ (కంచె )
ఉత్తమ నటుడు(క్రిటిక్స్ జ్యూరి ) : నాని (భలే భలే మగాడివోయ్)
ఉత్తమ నటి (క్రిటిక్స్ జ్యూరి ) : నిత్యా మీనన్ (మళ్లీ మళ్లీ ఇది రాణి రోజు)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus