ఆసక్తికరంగా మారిన శుక్రవారం సినిమాల సందడి

  • July 10, 2019 / 11:22 AM IST

ఒకే రోజు 11 తెలుగు సినిమాలు విడుదలైన చరిత్ర ఉంది టాలీవుడ్ కి.. సో ఇలా 6 సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడం అనేది పెద్ద సమస్య కాదు. అయితే.. ఆరు వైవిధ్యమైన సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడం మాత్రం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. శ్రీహరి కుమారుడు మేఘశ్యామ్ నటించిన “రాజ్ దూత్” ఈ శుక్రవారం విడుదలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యావత్ ఇండస్ట్రీ ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి శ్రీహరి కొడుకు హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకొంటోంది. అలాగే.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ కూతురు శివాత్మిక జంటగా రూపొందిన “దొరసాని” మీద కూడా మంచి హోప్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలతోపాటు సందీప్ కిషన్ తాజా చిత్రం “నిను వీడని నీడను నేనే” కూడా ఇదేవారం విడుదలవుతోంది. ఈ హారర్ సినిమా మీద కూడా మంచి అంచనాలున్నాయి.

ఈ మూడు కాకుండా ఆర్.నారాయణ మూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన “మార్కెట్లో ప్రజాస్వామ్యం” కూడా ఈవారం విడుదలవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి ఆడియోను విడుదల చేయడంతో సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది. తమిళంలో మంచి విజయం సొంతం చేసుకొన్న “కణా” చిత్రానికి రీమేక్ గా రూపొందిన “కౌసల్య కృష్ణమూర్తి” కూడా ఈ శుక్రవారం విడుదలవుతోంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన “కె.ఎస్ 100” కూడా ఈవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవన్నీ కాకుండా చాలా గ్యాప్ తర్వాత హృతిక్ రోషన్ నటించిన “సూపర్ 30” కూడా ఈ శుక్రవారం విడుదలవ్వనుంది. ఇలా ఈ శుక్రవారం అన్నీ మంచి అంచనాలున్న సినిమాలే విడుదలవుతుండడంతో.. ముందు ఏ సినిమా చూడాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సాధారణ ప్రేక్షకుడు.

1 మార్కెట్లో ప్రజాస్వామ్యం

2 కె.ఎస్.100,

3 దొరసాని

4 నిను వీడని నీడను నేనే

5 రాజ్ దూత్

6 కౌసల్య కృష్ణమూర్తి

7 సూపర్ 30


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus