“సినిమాల్లో” మెరిసిన టాలీవుడ్ సంగీత దర్శకులు!!!

  • July 25, 2016 / 11:43 AM IST

సినిమాకు ప్రాణం సంగీతం. అద్భుతమైన పాటలు, బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి చిత్రాన్ని ముందుకు పోనిచ్చి వెనుకే ఉండి పోతారు మ్యూజిక్ డైరక్టర్లు. తెర ముందుకు వచ్చేందుకు సిగ్గుపడే సంగీత దర్శకులు కొన్ని సినిమాల్లో తళుక్కున మెరిశారు. తమాషా చేశారు. వాయిద్యాలను కాసేపు పక్కన పెట్టి మేకప్ వేసుకున్న కొందరి గురించి..

కీరవాణి

రెండువందల సినిమాలకు పైనే పని చేసిన సంగీత దర్శకుడు స్వరవాణి కీరవాణి. తాను స్వరపరిచే పాటల్లో కొన్నిటికి గాత్రాన్ని అందించి వీనుల విందు చేశారు. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాలో చివరన వచ్చే పాటలో మరకత మణి కాసేపు కనిపించారు.

మణిశర్మ

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు అందించినా.. వేదికపై పాడేందుకు, మాట్లాడేందుకు కాస్త సిగ్గుపడుతుంటారు. అలాంటి వ్యక్తిని వెండి తెరపై చూపించే ప్రయత్నంలో “జై చిరంజీవ” బృందం విజయవంతమైంది. “థిల్లానా” పాటలో కొన్నిక్షణాలు మణిశర్మ కనిపిస్తారు.

దేవీ శ్రీ ప్రసాద్

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తన పాటలతో పాటు డాన్స్ లతో అదరగొడుతుంటారు. లైవ్ ఫెర్మార్మెన్స్ ఇవ్వడంలో డీఎస్పీ స్పెషలిస్ట్. అత్తారింటికి దారేది సినిమాలో “నిన్నుచూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే” అనే పాటలో దేవి తెరపైన కనిపించారు. చక్కగా నటించారు.

రమణ గోగుల

https://www.youtube.com/watch?v=BgJnBvMY7ds

విభిన్న వాయిద్యాలను వినియోగించి తెలుగు పాటలకు కొత్త ఫ్లేవర్ ని అద్దిన సంగీత దర్శకులు రమణ గోగుల. వేదికలపై ఎంతో ఉత్సాహంగా పాటలు పాడే ఈయన ప్రభాస్ యోగి సినిమాలో.. టైటిల్ పాటకు ఆలాపన పాడుతూ .. తెర పైన కనిపించారు.

చక్రి

మెలోడీ పాటలతో మత్తుజల్లే మ్యూజిక్ డైరక్టర్ చక్రి. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా పాటల్లో కల కాలం బ్రతికి ఉంటారు. హాస్య పాలు కాస్త ఎక్కువ అయినా చక్రి పలు సినిమాల్లో నటించారు. “ఎవడైతే నాకేంటి” చిత్రంలో చక్రి తన నటనతో మెప్పించారు.

కళ్యాణ్ కోడూరి

https://youtu.be/A_baOtc5nws?t=15m26s

ఐతే, అలా మొదలయింది చిత్రాలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి. ఇతను కూడా తాను స్వరాలు అందించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో తళుక్కున మెరిశారు.

ఆర్ పీ పట్నాయక్

https://www.youtube.com/watch?v=diapH9wp6P0

యువతకు ఆర్ పీ పట్నాయక్ పాటలంటే చాలా ఇష్టం. ఆయన స్వరపరిచిన గీతాలు ప్రేమ పైనే ఉంటాయి. అంతేకాదు. సింపులుగా పాడుకునే విధంగా ఉండడంతో బాగా పాపులర్ అయ్యాయి. శీను వాసంతి లక్ష్మీ సినిమాలో ఆర్ పీ హీరోగా నటించారు. అంధుడిగా అందరి మనసులను గెలుచుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus