దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఇదివరకు ఫిలిం మేకర్స్ హీరోయిన్లు కావాలంటే ఉత్తరాది వైపు చూసేవారు. నటీమణులను ఎక్కువగా ముంబై నుంచి నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆ భామలకు మన భాష రాకపోయినా అందంతో థియేటర్ కి ప్రేక్షకులను రప్పించేవారు. దీంతో నార్త్ ఇండియన్ బ్యూటీలనే ఎంపిక చేసుకోవడం అలవాటైంది. ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తున్నారు నేటి స్టార్ పుత్రికలు. సినీ వారసత్వంతో అడుగు పెట్టి విజయాన్ని అందుకుంటున్నారు. అందాల ప్రపంచంలోకి అబ్బాయిలే కాదు అమ్మాయిలు దైర్యంగా అడుగు పెట్టవచ్చని నిరూపిస్తున్నారు.
శృతి అండ్ అక్షర హాసన్విశ్వనటుడు కమలహాసన్, సారిక ల కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్. ఈ అక్క చెల్లెళ్లకి సినిమాలే లోకమయింది. సెట్స్, షూటింగ్ లను చూస్తూ పెరిగారు. హీరోల కొడుకులే సినిమాలోకి అడుగు పెట్టాలి.. కూతుళ్లు రాకూడదు అనే నానుడిని బ్రేక్ చేస్తూ శృతి హాసన్ హీరోయిన్ గా వెండి తెరకు పరిచయమైంది. మూడు భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అక్షర హాసన్ కూడా ధనుష్ సరసన నటించింది. ఇప్పుడు తండ్రి కమల్ “శెభాష్ నాయుడు” చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తోంది.
మంచు లక్ష్మిడైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సినీ రంగంలో అడుగు పెట్టి ఉత్తమ విలన్ గా అవార్డు అందుకోవడమే కాదు .. గ్లామర్ పాత్రల్లోనూ మెప్పించింది. నిర్మాతగా చిత్రాలను నిర్మిస్తూ, యాంకర్ గా షో లను నిర్వహిస్తూ వెండి తెర, బుల్లి తెరపై హవా కొనసాగిస్తోంది. మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న మేము సైతం కార్యక్రమం పేదల కుటుంబాల్లో వెలుగుని నింపుతోంది.
శ్రీదేవి విజయ్ కుమార్అలనాటి నటి మంజుల, నటి విజయ్ కుమార్ దంపతుల చిన్న కూతురు శ్రీదేవి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి వెండి తెరకు పరిచయమైంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి సినీ ప్రముఖుల అభినందనలు అందుకుంది. 2011 లో వచ్చిన రవితేజ మూవీలో శ్రీదేవి కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది.
కార్తీక అండ్ తులసి80 వ దశకంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన నటి రాధ కుమార్తెలు కార్తీక, తులసి. వీరిద్దరూ దక్షిణాది సినిమాల్లో సత్తా చాటుతున్నారు. కార్తీక జోష్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాగా, తులసి “మణిరత్నం” కడలి చిత్రంతో అరంగ్రేటం చేసింది. వీరిద్దరూ సినిమాకు సినిమాకు నటనలో మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఐశ్వర్య అర్జున్యాక్షన్ హీరో అర్జున్ కి తమిళం, తెలుగు భాషల్లో క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు రెండు చోట్ల విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ హీరో కుమార్తె ఐశ్వర్య అర్జున్. ఈమె తమిళం చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైంది. తర్వాత మరో రెండు తమిళ సినిమాలు చేసింది. త్వరలో తెలుగులోనూ స్ట్రయిట్ చిత్రంలో కనిపించనుంది.
నిహారిక కొణిదెలమెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. హీరోయిన్ గా తొలి అడుగు వేసింది మాత్రం నిహారిక. మెగా బ్రదర్ నాగేంద్ర బాబు డాటర్ ముందు బుల్లి తెరపై తన ప్రతిభను నిరూపించుకుని “ఒక మనసు” చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగ్రేటం చేసింది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం మరో సినిమా చేయడానికి మంచి కథ కోసం ఎదురుచూస్తోంది.
కీర్తి సురేష్మళయాలంలో పలు చిత్రాలను నిర్మించిన సురేష్ కూతురు కీర్తి. కీర్తి తల్లి తమిళంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇద్దరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కీర్తి హీరోయిన్ గా రాణిస్తోంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో చిత్రాలను చేస్తోంది. తెలుగులో ఆమె నటించిన “నేను శైలజ” సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం నాని పక్కన “నేను లోకల్” మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
శివానివెండి తెరకు పరిచయం కావడానికి సిద్ధంగా ఉన్న మరో స్టార్ పుత్రిక శివాని. ఈమె రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె. నటి, దర్శకురాలు, షో హోస్ట్ అయినా జీవిత తన కుమార్తె సినీ అరంగ్రేటం గ్రేట్ గా ఉండాలని కథలను వింటోంది. వచ్చే ఏడాది యాంగ్రీ హీరో రాజశేఖర్ డాటర్ ని హీరోయిన్ గా చూడనున్నాం.