ఖైదీ నంబర్ 150 లో దాగిన హిట్ కాంబినేషన్లు

  • January 7, 2017 / 07:37 AM IST

సినిమాలోనే కాదు.. సినీ పరిశ్రమలోనూ అనేక సెంటిమెంట్లు ఉంటాయి. హిట్ పెయిర్, హిట్ కాంబినేషన్ అంటూ అనేక నమ్మకాలు ఈ రంగంలో మొదటి నుంచి ఉన్నాయి. చిత్ర నిర్మాణం అంటే కోట్లతో కూడుకున్న విషయం కాబట్టి సెంటిమెంట్లను ఫాలో కావడంలో తప్పులేదు. మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ కూడా అనేక హిట్ కాంబినేషన్ల కలయిక. వాటిపై ఫోకస్..

1 . రీమేక్ కథఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల కథలు చిరంజీవికి బాగా సెట్ అవుతాయి. ఇది వరకు ఆయన పరాయి భాషా కథలతో చేసిన ఘరానా మొగుడు, ఠాగూర్, శంకర్ దాదా ఎమ్ బీబీఎస్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బిగ్ బాస్, రిక్షావోడు చిత్రాలు ఫెయిల్ అయి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ హిట్లర్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చారు. ఇది కూడా రీమేక్ చిత్రమే. అందుకే తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ కి తమిళ హిట్ కథను ఎంచుకున్నారు.

2 . కలం బలంతెలుగు చిత్ర పరిశ్రమలోని రచయితల్లో పరుచూరి బ్రదర్స్ కి మంచి గుర్తింపు ఉంది. వారి రచన అందించిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. పరుచూరి బ్రదర్స్ రచయితగా పనిచేసిన ఖైదీ, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్ర్తి,
బావగారు బాగున్నారా, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీఎస్, స్టాలిన్ చిత్రాలు చిరు కెరీర్ లో మైలు రాళ్లుగా నిలిచాయి. అందుకే వారి కలం బలం పై చిరుకి నమ్మకం ఎక్కువ. ఇప్పుడు ఫామ్లో లేకపోయినా స్క్రిప్ట్ మోనటరింగ్ చేసే బాధ్యత మెగాస్టార్, పరుచూరి బ్రదర్స్ కి ఇచ్చారు.

3 . డైరక్టర్హీరో, డైరక్టర్ కాంబినేషన్ పై నిర్మాతలకు మంచి నమ్మకం ఉంటుంది. గతంలో ఇలా ఎన్నో కాంబినేషన్లు వరుస హిట్లు అందుకున్నాయి. అది కాంబినేషన్ అని చెప్పడం కన్నా.. ఇద్దరి ఆలోచనలు కలవడమని చెప్పవచ్చు. అందుకే ఠాగూర్ వంటి హిట్ ఇచ్చిన డైరక్టర్ వి.వి. వినాయక్ ని ఈ చిత్రానికి చిరు తీసుకున్నారు. డైరక్టర్ గా కంటే ఒక అభిమానిగా వినాయక్ ఖైదీ నంబర్ 150 ని తెరకెక్కించారు.

4 . ఆడియో హిట్సినిమాపై అంచనాలను పెంచే విషయాల్లో ఆడియో ఒకటి. పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయిపోయినట్లేనని భావిస్తుంటారు. గతంలో మున్నాభాయ్ ఎమ్ బీ ఎస్ ఎస్, అందరివాడు, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. చిత్రం పరంగా రెండు నిరాశపరిచినప్పటికీ మూడు ఆల్బమ్స్ సూపర్ హిట్. నాలుగో చిత్రం పాటలు కూడా హిట్ అని యూట్యూబ్ రికార్డ్స్ స్పష్టం చేస్తున్నాయి. సో చిరు దేవీ కాంబినేషన్ పై పెట్టుకున్న నమ్మకం నిజమైంది.

5 . సర్ప్రైజింగ్ స్టెప్అభిమానులు కుర్చీలో నుంచి లేచి డ్యాన్స్ వేయాలంటే ఊపున్న పాటలతో అదిరే స్టెప్పులుండాలి. అటువంటి సర్ప్రైజింగ్ స్టెప్ చేయడంలో చిరు దిట్ట. ప్రతి చిత్రంలో కొత్తగా ట్రై చేస్తుంటారు. ప్రధానంగా హిట్లర్ లో అబీబీ స్టెప్, ఇంద్రలో వీణ స్టెప్పు, ఠాగూర్ లో కొడితే కొట్టాలిరా స్టెప్స్ చిరుకి సిగ్నేచర్ స్టెప్స్ గా నిలిచాయి. వాటిని కంపోజ్ చేసిన లారెన్స్ రత్తాలు పాటని కంపోజ్ చేశారు. అతను డైరక్టర్ గా బిజీగా ఉన్నప్పటికీ అన్నయ్య పిలవగానే వచ్చి అదిరే స్టెప్పులు వేయించారు.

6 . ఆయన పక్కన ఉంటే నవ్వులేహాస్యనటుడు బ్రహ్మానందం, చిరు స్క్రీన్ పై కనబడితే చాలు థియేటర్లో నవ్వుల వాన కురియాల్సిందే. ముఠా మేస్త్రి, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా?, ఇంద్ర చిత్రాలు వందరోజులు ఆడాయి. ఖైదీ నంబర్ 150 కూడా హండ్రడ్ డేస్ గ్యారంటీ.

7 . రామ్ చరణ్, కాజల్, చిరంజీవిరామ్ చరణ్, కాజల్, చిరంజీవి అనే కాంబినేషన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే చిత్రం మగధీర. ఈ మూవీ చెర్రీ కి అద్భుత హిట్ ని ఇచ్చింది. చరణ్ సినిమా బ్రూస్లీ లో చిరు కనిపించారు. కానీ ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ కాలేదు. బ్రూస్లీ లో కాజల్ మిస్ అయింది. ఇప్పుడు వీరు ముగ్గురు ఖైదీ నంబర్ 150 లో కనిపించబోతున్నారు. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది.

8 . డైరక్టర్ అప్పీరియన్స్లాస్ట్ బట్ నాట్ లీస్ట్. కత్తి లో ఆ చిత్ర డైరక్టర్ మురుగదాస్ ఒక సీన్లో కొన్ని క్షణాలు కనిపిస్తారు. తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహిస్తున్న వినాయక్ కూడా ఖైదీ నంబర్ 150 లో అదే పాత్రలో కనిపించనున్నారు. చిరు ఈ చిన్న సెంటిమెట్ ని కూడా వదలకుండా చిత్రంలో నింపారు.

ఇన్ని సెంటిమెంట్లు కలబోసిన ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలవాలని ఫిల్మీ ఫోకస్ కోరుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus