Bigg Boss 7 Telugu: ఈవారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా ? బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో పైర్ నామినేషన్స్ మొదలు అయ్యాయి. మంటల్లో పార్టిసిపెంట్ ఫోటోని పారేసి మరీ నామినేట్ చేయాలి. ఇక్కడే శివాజీ డైరెక్ట్ గా సీరియల్ బ్యాచ్ ని టార్గెట్ చేశాడు. వీకెండ్ నాగార్జున ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టీ ఈసారి శివాజీ తన గేమ్ లో గేర్ మార్చాడు. నిజానికి కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లినపుడు ఇంటికి వెళ్లిపోతాననే చెప్పాడు. కానీ, పిజియో చేయించుకుని గేమ్ ఆడమని కంటిన్యూ చేయమని చెప్పాడు హోస్ట్ నాగార్జున. దీనికి శివాజీ సై అన్నాడు.

అన్నట్లుగానే తన ఫైర్ ని పైర్ నామినేషన్స్ లో చూపించాడు. ప్రియాంక- శోభా ఇద్దరూ కూడా శివాజీతో పెద్ద యుద్ధమే చేసినట్లుగా సమాచారం. అంతేకాదు, ఈవారం నామినేషన్స్ కి హౌస్ దద్దరిల్లిపోయింది. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం ఈవారం మొత్తం 7గురు నామినేషన్స్ లో ఉన్నారు. కెప్టెన్ అర్జున్ పవర్ వల్ల ఒకరు సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈసారి నామినేషన్స్ లో ఆరుగురు మేల్ కంటెస్టెంట్స్, ఒకరు ఫిమేల్ కంటెస్టెంట్ ఉన్నారు. వాళ్లలో ప్రియాంక ఒక్కతే ఫిమేల్ కంటెస్టెంట్స్ మిగతా ఆరుగురు మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు.

శివాజీ, పల్లవి ప్రశాంత్, బోలే షవాలి, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, ఇంకా అమర్ దీప్ లు నామినేషన్స్ లో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. హౌస్ మేట్స్ ఎవరినైతే నామినేట్ చేస్తారో వారి ఫోటోని మంటల్లో వేయాల్సి ఉంటుంది. ఈవారం నామినేషన్స్ లో హౌస్ రగిలిపోయింది. ప్రిన్స్ యావార్ కి ప్రియాంకకి పెద్ద యుద్ధం జరిగింది. ఇద్దరూ కూడా వాదించుకున్నారు. నిజానికి గతవారం యావర్ ప్రియాంకని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించాడు. కేవలం తను చెప్పేది వినట్లేదని , రియాక్షన్స్ త్వరగా ఇస్తోందని చెప్పాడు. కెప్టెన్ అయ్యే అర్హత లేదని అన్నాడు. ఇదే పాయింట్ పై ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు.

అలాగే, శోభాశెట్టి – శివాజీ ఇద్దరి మద్యలో కూడా ఆర్గ్యూమెంట్స్ బాగా అయ్యాయి. ప్రిన్స్ యావర్ – గౌతమ్ ఇద్దరూ కూడా పెద్ద యుద్ధమే చేసుకున్నారు. గత కొన్ని వారాలుగా హౌస్ లో ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. అయితే, ఈసారి ప్రియాంక ఒక్కతే ఫిమేల్ కంటెస్టెంట్ మాత్రమే ఉంది. ఆరుగురు మేల్ ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా మేల్ కంటెస్టెంట్ వెళ్లే అవకాశం ఉంది. మరి వీళ్లలో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు అనేది ఈవారం (Bigg Boss 7 Telugu) ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus