పాతికేళ్లు పూర్తి చేసుకున్న సినిమాలు

  • January 28, 2017 / 02:26 PM IST

కొన్ని సినిమాలు థియేటర్ నుంచి వచ్చినా మనల్ని అంటిపెట్టుకుంటూనే ఉన్నాయి. ఆ చిత్రంలోని సన్నివేశాలు పదే పదే గుర్తొస్తూ నవ్విస్తాయి.. కన్నీటిని తెప్పిస్తాయి.. హుషారుని ఇస్తాయి. ఏళ్లు గడుస్తున్నా ఆ ఫిల్మ్స్ ని కొన్ని రోజుల క్రితమే చూసిన భావన కలుగుతుంటుంది. అలా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించి, రీసెంట్ గా పాతికేళ్లు పూర్తి చేసుకున్న మూవీస్ పై ఫోకస్..

చంటి విక్టరీ వెంకటేష్ అమాయకంగా నటిస్తూ మహిళల మనసులు గెలుచుకున్న చిత్రం చంటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీనా, వెంకటేష్ ల ప్రేమకథ, అన్నా చెల్లి అనురాగం అందరినీ ఆకట్టుకుంది. తమిళ చిత్రం చినతంబీ సినిమాకి ఇది రీమేక్ అయినప్పటికీ 40 సెంటర్స్ లో వందరోజులు ఆడింది.

ఆపద్భాంధవుడుమెగాస్టార్ చిరంజీవి, కళా తపస్వి కె. విశ్వనాధ్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఆపద్భాంధవుడు. ఈ మూవీలో హాస్య బ్రహ్మ జంధ్యాల, చిరు, మీనాక్షి శేషాద్రి హీరోయిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు రాయిలాంటి గుండె కింద దాగున్న కన్నీటి చెమ్మను బయటికి తెస్తుంది. ఈ చిత్రంలోని నటనకు గాను చిరంజీవి నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.

ఆ ఒక్కటి అడక్కునట కిరిటీ రాజేంద్రప్రసాద్, విలక్షణ నటుడు రావు గోపాలరావు కలిసి చేసిన నవ్వుల హంగామా ఆ ఒక్కటి అడక్కు. ఇందులోని ప్రతి సీన్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టదు. పైగా గత ఏడాది రిలీజ్ అయిన చిత్రంగా అనుభూతిని ఇస్తుంది.

చిత్రం భళారే విచిత్రం గొప్పనటి విజయ నిర్మల తనయుడు నరేష్ అమ్మాయి వేషంలో పాతికేళ్ల క్రితం చేసిన హడావుడిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఇందులో నరేష్ తో పాటు అతి భక్తుడిగా బ్రహ్మనందం, పిరికి వాడిగా శుభలేఖ సుధాకర్, వయసు పెరిగినా బుద్ధి పెరగని పిల్లాడిగా మహర్షి నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

ఘరానా మొగుడుటాలీవుడ్ లో నంబర్ వన్ హీరోగా చిరంజీవి చెలరేగిపోతున్న సమయంలో చేసిన చిత్రం ఘరానామొగుడు. చిరుకి పోటీగా నగ్మా నటించిన ఈ మూవీ మొట్ట మొదటిసారి 10 కోట్ల వసూళ్ల మార్క్ ని చేరుకున్న సౌత్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు లోకి ఎక్కింది.

పెద్దరికంతెలుగు ఇళ్లల్లో సాధారణంగా ఉండే ప్రేమలు, పగలను వెండితెరపై ఆవిష్కరించిన మూవీ పెద్దరికం. ఈ మూవీలో ఎమోషన్ ప్రతి ఒక్కరిని కదిలించింది. ఏఎం రత్నం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ జగపతిబాబుకు తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

రౌడీ ఇన్ స్పెక్టర్నటసింహ నందమూరి బాలకృష్ణ పవర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం రౌడీ ఇన్ స్పెక్టర్. కమర్షియల్ చిత్రాల డైరక్టర్ బి.గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రం కలక్షన్ల వర్షం కురిపించింది. యాక్షన్, లవ్, డ్రామా కలిసిన ఈ మూవీ బాలకృష్ణ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది.

సుందర కాండమహిళల్లో విపరీతమయిన ఫాలోయింగ్ ఉన్న సమయంలోనే విక్టరీ వెంకటేష్ పెళ్లి అయిన వ్యక్తి కథలో నటించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సుందర కాండ మూవీలో వెంకీ, మీనా, అపర్ణల మధ్య సీన్స్ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి.

అప్పుల అప్పారావుఅప్పు..డే తెల్లారిందా… అంటూ రాజేంద్ర ప్రసాద్ నిమిషానికి ఓ జోక్ పేలుస్తూ అప్పుల అప్పారావు సినిమాని నవ్వుల టానిక్ గా మార్చారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వ ప్రతిభకి ఎల్ బీ శ్రీ రామ్ రచన చమత్కారం తోడై ఈ మూవీని సూపర్ హిట్ చేశాయి. ఈ చిత్రానికి పాతికేళ్లు నిండాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus