Actress Gouri Kishan: యంగ్ హీరోతో గౌరీ కిషన్ రొమాన్స్!

’96’ సినిమాతో తమిళంలో పాపులారిటీ సంపాదించుకున్న నటి గౌరీ కిషన్. యంగ్ త్రిష క్యారెక్టర్ పోషించిన ఆమెకి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ‘జాను’ సినిమాలో కూడా గౌరీ కిషన్ ను తీసుకున్నారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ.. గౌరీ కిషన్ కు ఫేమ్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ హీరోయిన్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే తమిళంలో ఒకట్రెండు సినిమాలు చేస్తోంది.

ఇప్పుడు తెలుగులో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది. సంతోష్ శోభన్ నటిస్తోన్న సినిమాలో గౌరీ కిషన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొన్నాళ్ల క్రితం గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ బ్యానర్ లో ఓ వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఇప్పుడు తమిళంలో సూపర్ హిట్ అయిన ‘8 తూట్టాక్కళ్‌’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంతోష్ శోభన్ ను హీరోగా తీసుకోగా.. అతడికి జోడీగా గౌరీ కిషన్ ను ఫైనల్ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. మరి హీరోయిన్ గా గౌరీ కిషన్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus